Sukumar : పుష్ప సూసీకి సాంగ్ ఆల్మోస్ట్ మొత్తం తనే చేసింది.. అప్పుడు క్రెడిట్స్ ఇవ్వలేకపోయాను.. శ్రష్టి వర్మపై సుకుమార్ కామెంట్స్..

ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కి కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ కూడా హాజరైంది.

Sukumar : పుష్ప సూసీకి సాంగ్ ఆల్మోస్ట్ మొత్తం తనే చేసింది.. అప్పుడు క్రెడిట్స్ ఇవ్వలేకపోయాను.. శ్రష్టి వర్మపై సుకుమార్ కామెంట్స్..

Sukumar Interesting Comments on Pushpa 2 Song and Choreographer Shrasti Verma

Updated On : May 29, 2025 / 10:20 AM IST

Sukumar : అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో సాంగ్స్, స్టెప్పులు కూడా వైరల్ అయ్యాయి. అల్లు అర్జున్, రష్మిక కాంబోలో ‘సూసీకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..’ అనే పాట కూడా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాట రిలీజ్ అయినప్పుడు ఈ సాంగ్ ని కొరియోగ్రఫీ చేసింది గణేష్ ఆచార్య మాస్టర్ అని అధికారికంగానే ప్రకటించారు.

అయితే తాజాగా సుకుమార్ ఈ పాట గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించిన సీతా పయనం సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కి సుకుమార్ గెస్ట్ గా వచ్చారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కి కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ కూడా హాజరైంది.

Also Read : C Kalyan : మహేష్ ఫ్యాన్స్ వల్లే ‘ఖలేజా’ నాశనమైంది.. తాగేసి నాకు, త్రివిక్రమ్ కి ఫోన్ చేసి బూతులు తిట్టారు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు..

ఈ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడుతూ.. పుష్ప సినిమాలో సూసీకి సాంగ్ ఆల్మోస్ట్ 80 శాతం శ్రష్టి వర్మనే కంపోజ్ చేసింది. సినిమాలో కొన్ని చిన్న చిన్న మాంటైజ్ షాట్స్ కూడా తనే కంపోజ్ చేసింది. ఆ క్రెడిట్ తనకి ఇవ్వాలి. అప్పుడు ఇవ్వలేకపోయాను అని తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

కొన్ని నెలల క్రితం శ్రష్టి వర్మ జానీ మాస్టర్ కేసులో వైరల్ అయిన సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ పై శ్రష్టి వర్మ పలు ఆరోపణలు చేయగా ఆయన జైలుకు వెళ్లి వచ్చాడు. పుష్ప సినిమా నుంచి జానీ మాస్టర్ ని తప్పించారని కూడా వార్తలు వచ్చాయి. అప్పట్లో నిర్మాతలు కూడా జానీ మాస్టర్ ని అనుకున్నాం కానీ కుదరలేదు అని చెప్పారు. అయితే జానీ మాస్టర్ చేయాల్సిన సాంగ్ ని శ్రష్టి వర్మతో చేయించి ఫేమ్, మార్కెట్ కోసం గణేష్ ఆచార్య పేరు వేసినట్టు ఇప్పుడు సుకుమార్ మాటల్లో తెలిసిపోతుంది అని నెటిజన్లు భావిస్తున్నారు.

Also Read : HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ రిలీజ్ ఆ రోజునే.. ఫ్యాన్స్ గెట్ రెడీ..