వందేళ్లొచ్చినా సరే తెలుగులో మాత్రమే నటిస్తాను
బాలీవుడ్, హాలీవుడ్ వంటి ఇతర ఇండస్ట్రీలకి వెళ్లే ఉద్దేశ్యం లేదు - సూపర్‌స్టార్ మహేష్ బాబు..

బాలీవుడ్, హాలీవుడ్ వంటి ఇతర ఇండస్ట్రీలకి వెళ్లే ఉద్దేశ్యం లేదు – సూపర్‌స్టార్ మహేష్ బాబు..
సూపర్‌స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో.. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు కలిసి నిర్మించిన ‘‘సరిలేరు నీకెవ్వరు’’ సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు నుండే పాజిటివ్ టాక్‌తో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందీ సినిమా. ఫస్ట్ వీక్ రూ.105.56 కోట్ల షేర్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇక నాలుగు రోజుల క్రితం కొందరు భారత జవాన్‌లతో కలిసి సరిలేరు సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్న ‘జైహింద్’ అనే ప్రత్యేక కార్యక్రమంలో మహేష్ బాబు మాట్లాడుతూ : ‘‘తనకు వందేళ్లు వచ్చినా సరే తాను మాత్రం తెలుగు సినిమాల్లో మాత్రమే నటిస్తానని, ఎప్పటికీ బాలీవుడ్, హాలీవుడ్ వంటి ఇతర ఇండస్ట్రీలకి వెళ్లే ఉద్దేశ్యం లేదని’’ అన్నారు.
Read Also : దీపావళి ముందు పతంగులేందిరా – ఆసక్తికరంగా ‘సవారి’ ట్రైలర్
నిజానికి గతంలో కూడా పలు మార్లు సూపర్ స్టార్ మహేష్ ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఇక సరిలేరు యూనిట్ పాల్గొన్న ‘జైహింద్’ ప్రోగ్రాం జనవరి 26న రిపబ్లిక్ డే కానుకగా ప్రసారం కానుంది.. ప్రస్తుతం దిగ్విజయంగా రెండో వారం ప్రదర్శింపబడుతుంది ‘సరిలేరు నీకవ్వరు’..