Gopichand Malineni : వీరసింహారెడ్డి చూసి రజినీకాంత్ ఫోన్ చేశారు.. మర్చిపోలేని అనుభవం అంటూ డైరెక్టర్ ట్వీట్..

డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రాక్ సినిమా తర్వాత మళ్ళీ వీరసింహారెడ్డి సినిమాతో మరో విజయం సాధించాడు. దీంతో గోపీచంద్ ని అంతా అభినందిస్తున్నారు. తాజాగా గోపీచంద్ కి కాల్ చేసి సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమా విషయంలో...............

Gopichand Malineni : వీరసింహారెడ్డి చూసి రజినీకాంత్ ఫోన్ చేశారు.. మర్చిపోలేని అనుభవం అంటూ డైరెక్టర్ ట్వీట్..

Superstar Rajinikanth call to Gopichand Malineni and appreciated for veerasimhareddy movie

Updated On : January 30, 2023 / 11:05 AM IST

Gopichand Malineni :  బాలకృష్ణ హీరోగా, శృతి హాసన్, హానీరోజ్ హీరోయిన్స్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి. సంక్రాంతికి రిలీజయిన ఈ సినిమా యాక్షన్, మాస్, సిస్టర్ సెంటిమెంట్స్ తో ప్రేక్షకులని, అభిమానులని అలరించి భారీ విజయం సాధించింది. అఖండ సినిమా తర్వాత బాలకృష్ణ ఈ సినిమాతో మరోసారి 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేశాడు. థియేటర్స్ లో వీరసింహారెడ్డి సినిమా విజయం సాధించడంతో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా ఇటీవలే అభిమానుల మధ్య నిర్వహించారు.

ఇక డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రాక్ సినిమా తర్వాత మళ్ళీ వీరసింహారెడ్డి సినిమాతో మరో విజయం సాధించాడు. దీంతో గోపీచంద్ ని అంతా అభినందిస్తున్నారు. తాజాగా గోపీచంద్ కి కాల్ చేసి సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమా విషయంలో అభినందించారు. రజినీకాంత్ ఇటీవల రిలీజయిన అన్ని పరిశ్రమల సినిమాలు చూస్తూ మంచి సినిమాలు తీసిన డైరెక్టర్స్ కి కాల్ చేసి, లేదా పిలిపించి మరీ అభినందిస్తున్నారు. తాజాగా రజినీకాంత్ గోపిచంద్ మలినేనిని అభినందించడంతో ఈ విషయాన్ని డైరెక్టర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Shahrukh Khan : పఠాన్ సక్సెస్ తర్వాత ఫ్యాన్స్‌కి అభివాదం చేసిన షారుఖ్.. జనసంద్రమైన మన్నత్ రోడ్..

గోపీచంద్ మలినేని ట్విట్టర్ లో.. ఇది నాకు నమ్మలేకపోతున్నాను. తలైవర్, సూపర్ స్టార్ నుండి నాకు కాల్ వచ్చింది. రజినీకాంత్ సార్ వీరసింహారెడ్డి సినిమాని చూసి, సినిమా నచ్చి నాకు కాల్ చేశారు. నా సినిమా గురించి ఆయన అభినందించిన తీరు, ఆయన చూపించిన ఎమోషన్స్ నాకు ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ. థాంక్యూ రజనీ సార్ అంటూ పోస్ట్ చేశాడు. దీంతో మరోసారి పలువురు గోపీచంద్ ని అభినందిస్తున్నారు.