క్షేమంగా ఇంటికి చేరుకున్న రజినీకాంత్

Superstar Rajinikanth: హైబీపీతో బాధపడుతూ జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్లో చికిత్సపొందుతున్న సూపర్‌స్టార్ రజనీ కాంత్ ఆదివారం డిశ్చార్జ్ అయ్యారు. పెద్ద
కుమార్తె ఐశ్వర్యతో కలిసి ప్రత్యేక విమానంలో ఆదివారం చెన్నై బయలుదేరారు. రజినీ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందిన అభిమానులు భారీగా ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు.
అడుగడుగునా ‘తలైవా.. తలైవా..’ అంటూ ఆయనకు ఘనస్వాగతం పలికారు. భార్య లత రజినీకాంత్ హారతిచ్చి ఇంట్లోనికి ఆహ్వానించారు. ఇంటికి చేరుకోగానే రజినీ అభిమానులకు అభివాదం చేశారు.
రజినీ నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుండగా.. ప్రొడక్షన్ టీం లో 8 మందికి కరోనా సోకడంతో చిత్రీకరణ వాయిదా వేశారు. రజినీకి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా నిర్థారణ అయింది.