Upasana Kamineni Konidela : అత్తగారి పుట్టినరోజు నాడు మెగా కోడలు కొత్త బిజినెస్ ప్రారంభం

మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ, కోడలు ఉపాసన కొత్త వ్యాపారం ప్రారంభించారు. వివరాలను ఉపాసన సోషల్ మీడియాలో వెల్లడించారు.

Upasana Kamineni Konidela : అత్తగారి పుట్టినరోజు నాడు మెగా కోడలు కొత్త బిజినెస్ ప్రారంభం

Upasana Kamineni Konidela

Updated On : February 18, 2024 / 3:29 PM IST

Upasana Kamineni Konidela : మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ కొణిదెల కొత్త వ్యాపారంలోకి అడుగుపెట్టారు. సురేఖ పుట్టినరోజు సందర్భంగా ‘అత్తమాస్ కిచెన్’ పేరుతో తన అత్తగారు బిజినెస్‌లోకి అడుగుపెడుతున్నట్లు మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో వెల్లడించారు. తమ కొత్త వ్యాపారం ద్వారా  అత్తాకోడళ్లిద్దరూ కొణిదెల వారి వంటింటి రుచుల్ని అందరికీ పరిచయం చేయబోతున్నారు.

Ram Charan : చరణ్-ఉపాసనల కొత్త పిక్ వైరల్.. క్లీంకారతో కామెడీ పుట్టిస్తున్న అభిమానులు..

చిరంజీవి భార్య సురేఖ కొత్త వెంచర్ ప్రారంభించారు. ‘అత్తమ్మాస్ కిచెన్’ పేరుతో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టారు. సురేఖ పుట్టినరోజున ఈ విషయాన్ని కోడలు ఉపాసన వెల్లడించారు. ‘ అత్తమ్మ పుట్టినరోజు సందర్భంలో  మా ఫ్యామిలీ ‘అత్తమాస్ కిచెన్’ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది.. రుచి, సంప్రదాయాలకు అనుగుణంగా మీరు ఉన్నచోటనే రుచుల మిశ్రమాన్ని అనుభవించండి.. నేరుగా మా వంట గది నుండి మీ ఇంటికి’ .. అంటూ ఉపాసన పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. నిజానికి చిరంజీవి షూటింగ్స్ నిమిత్తం నెలల తరబడి బయట ఉన్నప్పుడు ఇంటి రుచులు మిస్ కాకుండా సురేఖ ఇలాంటి మిశ్రమాలను ప్యాక్ చేసి ఇచ్చేవారట. దాని నుండి ప్రేరణే ఈ బ్రాండ్ ప్రారంభానికి పునాది అని తెలుస్తోంది. ఈ వెంచర్‌లో ఉపాసన కీలకపాత్ర వహిస్తున్నారు.

Upasana : మెగా కోడలు కూడా రాజకీయాల్లోకి రాబోతున్నారా.. విజయ్ పొలిటికల్ ఎంట్రీ‌పై ఉపాసన కామెంట్స్..

ఉపాసన పోస్ట్ చేసిన వీడియో చూస్తే ఉప్మా, పొంగల్, పులిహోర, రసం వంటి మిశ్రమాలు కనిపించాయి.  ఈ మిశ్రమాలతో మన వంటింట్లో రుచికరమైన వంటలు సులభంగా వాటిని తయారు చేసుకోవచ్చు. ఇంటి రుచులను ఆస్వాదించవచ్చును.  ఈ ఉత్పత్తులను ఆన్ లైన్‌లో అందుబాటులోకి తెచ్చారు.. ఈ వెంచర్ సురేఖ, ఉపాసనల అనుబంధాన్ని,  గౌరవాన్ని సూచిస్తోంది. మొత్తానికి కోడలి సహకారంతో సురేఖ అడుగులు వేస్తున్న కొత్త వెంచర్ సక్సెస్ కావాలని అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

 

View this post on Instagram

 

A post shared by Athamma`s Kitchen (@athammaskitchen)