Vikram : ఇద్దరు స్టార్ హీరోలతో కమల్ హాసన్ సినిమా.. ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా..
కమల్‌హాసన్, విజయ్ సేతుపతి, ఫాహిద్ ఫాజిల్.. ఈ ముగ్గురిని పెట్టి భారీ మల్టి స్టారర్ విక్రమ్ తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఇప్పటికే ఈ సినిమా..............
Kamalhaasan : కమల్‌హాసన్, విజయ్ సేతుపతి, ఫాహిద్ ఫాజిల్.. ఈ ముగ్గురిని పెట్టి భారీ మల్టి స్టారర్ విక్రమ్ తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, ఓ సాంగ్ రిలీజ్ అయింది. ముగ్గురు స్టార్ హీరోలు నటిస్తుండటంతో అటు ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ‘విక్రమ్’ జూన్ 3న విడుదలకానుంది.
తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ముగ్గురు స్టార్ హీరోలు ఉన్న ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా ఉన్నారని సమాచారం. ఇటీవల డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘విక్రమ్’ సినిమాలో తమిళ్ స్టార్ హీరో సూర్య కీలకమైన అతిథి పాత్రలో నటించబోతున్నారు, కథని మలుపుతిప్పే పాత్రలో సూర్య కనిపిస్తారని, ఆయన క్యారెక్టర్ సినిమాకి మరింత స్పెషల్ అవుతుందని తెలిపాడు.
Pawan Kalyan : సముద్రఖని దర్శకత్వంలో పవన్ సినిమా.. మరో రీమేక్..
సూర్య కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడని తెలిసి సూర్య అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏకంగా నలుగురు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కనపడుతుండటంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ సినిమాని కమల్ తన సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మించారు.