Surya : సూర్య లాంటి కమర్షియల్ హీరో ఈ సినిమా తీసి కొత్త ఒరవడిని సృష్టించారా??

సూర్య ఒక పక్క కమర్షియల్ సినిమాలతో పాటు నటనకి ప్రాధాన్యం, కథ ప్రాధాన్యం ఉన్న సినిమాలు కూడా అప్పుడప్పుడు చేస్తున్నాడు. స్టార్ హీరో ఇలా స్టేటస్, కలెక్షన్స్, కమర్షియల్ అంటూ చూడకుండా

Surya : సూర్య లాంటి కమర్షియల్ హీరో ఈ సినిమా తీసి కొత్త ఒరవడిని సృష్టించారా??

Jai Bheem Surya

Updated On : November 5, 2021 / 2:09 PM IST

Surya :  స్టార్ హీరో సూర్య తమిళ్ లో మంచి కమర్షియల్ హీరో. ఆయనకి ఫ్యాన్ బేస్ తో పాటు ఆయన సినిమాలకి కలెక్షన్స్ కూడా ఎక్కువే. సూర్య ఎక్కువగా మాస్ సినిమాలు చేస్తాడు. వాటి ద్వారే అభిమానులని సంపాదించుకున్నాడు. మాస్, కమర్షియల్ సినిమాలతో అభిమానులు రావొచ్చు, కలెక్షన్స్ రావొచ్చు కాని నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్ర దక్కదు. కమర్షియల్ సినిమాల్లో నటనకి స్కోప్ తక్కువగా ఉంటుంది. అందుకే సూర్య ఒక పక్క కమర్షియల్ సినిమాలతో పాటు నటనకి ప్రాధాన్యం, కథ ప్రాధాన్యం ఉన్న సినిమాలు కూడా అప్పుడప్పుడు చేస్తున్నాడు.

Jai Bheem : ‘జై భీమ్’ సినిమా కథ అసలు హీరో ఈయనే

చాలా మంది కమర్షియల్ హీరోలు తమ ఫార్ములాని పక్కన పెట్టి ఏదైనా కొత్త సినిమా చేస్తే చాలా వరకు నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. కాని సూర్య నాన్ కమర్షియల్ సినిమాలతో కూడా విజయం సాధిస్తున్నాడు. శివ పుత్రుడు, రక్త చరిత్ర, యువ, గజినీ లాంటి సినిమాల్లో అద్భుతమైన నటనని చూపించడు సూర్య. గత సంవత్సరం ఎయిర్ డెక్కన్ అధినేత జీఆర్ గోపినాథ్ జీవిత చరిత్రని ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాగా తీసి మంచి విజయం సాధించాడు. థియేటర్స్ లేకపోవడంతో ఓటిటిలో రిలీజ్ అయినా భారీ విజయం సాధించింది. ఈ సినిమాలో సూర్య నటనకి విమర్శకుల నుంచి కూడా ప్రశంశలు వచ్చాయి. ఈ సినిమాలో సూర్య నటన చూసినవారికి కన్నీళ్లు ఆగవు. ఆస్కార్ బరిలో కూడా నిలిచింది సినిమా. అంత గొప్ప సినిమా తర్వాత మళ్ళీ కమర్షియల్ జోలికి వెళ్లకుండా మరో బయోపిక్ తో ప్రయోగం చేశాడు సూర్య.

Bigg Boss Swetha : లక్ష రూపాయలిచ్చి నన్ను కమిట్‌మెంట్ అడిగారు : బిగ్ బాస్ శ్వేత

తాజాగా చంద్రూ అనే ఒక అడ్వకేట్ జీవిత చరిత్రని, ఒక కేసు విషయంలో నిస్వార్థంగా ఆయన చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ‘జై భీమ్’ సినిమాను చేశాడు సూర్య. ఈ సినిమా దీపావళి కానుకగా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. సొంత బ్యానర్లో సూర్య, జ్యోతికలు ఈ సినిమాని నిర్మించడం విశేషం. ఈ సినిమాకి జ్ఞానవేల్ దర్శకత్వం వహించాడు. ఇప్పుడు అంతా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ‘జై భీమ్’ సినిమాలో కమర్షియల్ అంశాలకు స్కోప్ లేదు. ఒక గిరిజన యువకుడి లాకప్ డెత్ కి సంబంధించిన కథ. సూర్య ఇందులో ఓ లాయర్ పాత్రని పోషించి అద్భుతంగా నటించి మెప్పించారు. సూర్య తలుచుకుంటే ఎంతో మంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అతనితో కమర్షియల్ సినిమాలు చేయడానికి క్యూలో ఉంటారు. కాని ఇలాంటి మంచి కథలని, సమాజానికి మంచి చేసిన వారి జీవితాలని ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే సూర్య ఈ సినిమాలు చేస్తున్నాడు.

Blakrishna : బాలకృష్ణ సినిమాలో విలన్ గా చేయడానికి నేను రెడీ : మోహన్ బాబు

ఇలాంటి సినిమాలకి కలెక్షన్స్ వస్తాయో రావో అనే సందేహం ఉంటుంది. అందుకే సూర్య వేరే నిర్మాతలు ఇబ్బంది పడకూడదు అని తన సొంత బ్యానర్ లోనే ఈ ‘జై భీమ్’ సినిమాని నిర్మించాడు. ఇలాంటి గొప్ప గొప్ప కథలని అందరికి తెలిసేలా చేస్తున్న సూర్యను ఇప్పుడు అందరూ ప్రశంశిస్తున్నారు. స్టార్ హీరో ఇలా స్టేటస్, కలెక్షన్స్, కమర్షియల్ అంటూ చూడకుండా సినిమాలు తీసి కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు సూర్య. భవిష్యత్తులో కూడా ఇలాంటి సినిమాలు తీయడానికి రెడీగా ఉన్నాడు. మరి సూర్యని చూసి మిగిలిన హీరోలు ఈ బాటలో పయనిస్తారా, ఈ పంథాలో కనీసం ఒక్క సినిమా ఐనా చేస్తారేమో చూడాలి.