సైరా సినిమా కోసం చిరంజీవి రెమ్యూనరేషన్ ఎంతంటే?

  • Published By: vamsi ,Published On : September 26, 2019 / 07:01 AM IST
సైరా సినిమా కోసం చిరంజీవి రెమ్యూనరేషన్ ఎంతంటే?

Updated On : September 26, 2019 / 7:01 AM IST

తెలుగు సినిమా చరిత్రలో ప్రతిష్టాత్మకంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. రామ్ చరణ్ నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 2వ తేదీన విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌ లో రూ.270 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సైరా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా విడుదల అవుతుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను సినిమా యూనిట్ అభిమానులతో పంచుకుంది.

బాహుబలి, సాహో సినిమాల తర్వాత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా.. సినిమా కోసం నటులను ఎంపిక చేసిన విధానంను వెల్లడించింది. వంద మందికి పైగా బ్రిటిష్ నటులను లండన్ లో 30 రోజుల పాటు ఆడిషన్ చేసి కీలక పాత్రల కోసం ఏడు మంది నటులను ఎంపిక చేసినట్లు చెప్పింది. వారి నటన సినిమాకు ఎంతగానో ఉపయోగపడినట్లు సినిమా యూనిట్ చెబుతుంది.

ఇదిలావుండగా సినిమా కోసం చిరంజీవికి రూ.40 కోట్లు చెల్లించినట్లుగా తెలుస్తుంది. చిత్రయూనిట్ అఫిషియల్ గా ప్రకటించనప్పటికీ, సినిమా కోసం చిరంజీవి చాలా సమయం కేటాయించగా ఆయనకు ఇంత మొత్తం చిత్ర యూనిట్ ఇచ్చినట్లుగా సమాచారం. ఇక ఈ సినిమాలో నటించిన నయనతారకు రూ. 6కోట్లు పారితోషకం ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతిలు పలు భాషల నుంచి ముఖ్యపాత్రల్లో నటించారు.