టాలీవుడ్ పెద్దదిక్కు చిరంజీవే – తలసానితో భేటీపై ఆసక్తి

మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ..

  • Published By: sekhar ,Published On : February 4, 2020 / 12:35 PM IST
టాలీవుడ్ పెద్దదిక్కు చిరంజీవే – తలసానితో భేటీపై ఆసక్తి

Updated On : February 4, 2020 / 12:35 PM IST

మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునలతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భేటీ..

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈరోజు జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసంలో అక్కినేని నాగార్జునతో పాటు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎఫ్ డీసీ ఛైర్మన్ రామ్మోహన్ రావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 

సినీ కళాకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అందజేత, థియేటర్ల కొరత, ఆన్ లైన్ టికెటింగ్ విధానం, షూటింగ్ పర్మిషన్లతో సహా లోకేషన్లలో మహిళల భద్రతపై సుదీర్ఘంగా చర్చించారు. తాజాగా జరిగిన ఈ భేటిపై చిత్రపరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

CHIRU

గత రెండు రోజుల నుంచి పలువురు సినీ పెద్దల నుంచి ప్రధాన సమస్యలను గుర్తించిన ప్రభుత్వం వాటి పరిష్కారానికి ముందడుగు వేయబోతుంది. తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధిపై చిరంజీవి, నాగార్జున సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేక సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్.శంకర్, సినీకార్మిక సంఘాల ప్రతినిధులు కొమర వెంకటేష్, హుమాయున్, సురేష్ దొరై, రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.