‘మనోళ్లు లేరా.. తమన్నానే దొరికిందా?’.. ఆ సబ్బు బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నా ఎంపికపై కన్నడిగుల ఆగ్రహం

బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నాను ఎంపిక చేయడం పట్ల మంత్రి స్పందించారు.

‘మనోళ్లు లేరా.. తమన్నానే దొరికిందా?’.. ఆ సబ్బు బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నా ఎంపికపై కన్నడిగుల ఆగ్రహం

Tamannaah Bhatia

Updated On : May 24, 2025 / 10:05 AM IST

మైసూర్ శాండల్ సబ్బు బ్రాండ్ అంబాసిడర్‌గా హీరోయిన్ తమన్నా భాటియాను ఎంపిక చేస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వరంగ సంస్థ కర్ణాటక సోప్స్‌ అండ్ డిటర్జెంట్స్‌ లిమిటెట్‌ రెండేళ్ల కాలపరిమితితో రూ.6.2 కోట్లకు తమన్నాతో ఈ ఒప్పందం కుదుర్చుకుంది.

అయితే, బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నాను ఎంపిక చేయడం పట్ల కర్ణాటక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకకు చెందిన రష్మిక మందన్న, శ్రీనిధి శెట్టి, రుక్మిణి వసంత్ వంటి హీరోయిన్లను కాదని, ఇతర రాష్ట్రానికి చెందిన వారిని ఎందుకు ఎంపిక చేశారంటూ సోషల్ మీడియాలో కన్నడ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

Also Read: ఇది కదా కమల్, మణిరత్నం అంటే.. ఎంత ఎదిగినా.. ఇలా.. 

మైసూర్‌ శాండల్‌ ఉత్పత్తులకు తమన్నాతో ప్రచారం చేయించడం ఏంటని నిలదీస్తున్నారు. కర్ణాటకలో చాలా మంది సెలెబ్రిటీలు ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రానికి చెందిన హీరోయిన్‌నే ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని అంటున్నారు.

మరికొందరు ప్రభుత్వపైనే కాకుండా తమన్నాపై కూడా విమర్శలు చేస్తున్నారు. సర్కారు తీసుకున్న నిర్ణయం కన్నడ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోందని అంటున్నారు. మైసూర్‌ శాండల్‌ సోప్‌ సంస్థను 1900లో మైసూర్‌ రాజు కృష్ణరాజ్‌ వడియార్‌-4 స్థాపించారు.

బ్రాండ్ అంబాసిడర్‌గా తమన్నాను ఎంపిక చేయడం పట్ల కర్ణాటక మంత్రి ఎంబీ పాటిల్ స్పందిస్తూ.. ఈ సబ్బులకు తమ రాష్ట్రంలో డిమాండ్‌ బాగా ఉందని తెలిపారు. వీటి ఉత్పత్తిని దేశ వ్యాప్తంగా విస్తరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కొందరు వాణిజ్య నిపుణులు కూడా తమన్నాను ప్రచారకర్తగా ఎంపిక చేయాలని ప్రతిపాదనలు చేశారని అన్నారు.