Vijay Varma : తమన్నా బాయ్‌ఫ్రెండ్‌తో అలియా భట్ పెళ్లి ఫోటో.. క్లారిటీ ఇచ్చిన విజయ్ వర్మ..
తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉందని గత కొన్నాళ్ల నుంచి వార్తలు రాగా ఇటీవల ఇద్దరో ఆ వార్తలు నిజమే అంటూ కన్ఫర్మ్ చేశారు. తాజగా విజయ్ వర్మకు అలియాభట్ తో పెళ్లి అయిపోయినట్టు ఓ ఫోటో వైరల్ అయింది.

Tamannaah Boyfriend Vijay Varma and alia bhatt marriage photo goes viral
Alia Bhatt : తమన్నా(Tamannaah) బాలీవుడ్(Bollywood) నటుడు విజయ్ వర్మ(Vijay Varma)తో ప్రేమలో ఉందని గత కొన్నాళ్ల నుంచి వార్తలు రాగా ఇటీవల ఇద్దరో ఆ వార్తలు నిజమే అంటూ కన్ఫర్మ్ చేశారు. వీరిద్దరూ కలిసి ఇటీవల లస్ట్ స్టోరీస్ లో నటించారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక ఈ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని బాలీవుడ్ పార్టీలకు, బయట ఈవెంట్స్ కి తిరిగేస్తున్నారు. అయితే తాజగా విజయ్ వర్మకు అలియాభట్ తో పెళ్లి అయిపోయినట్టు ఓ ఫోటో వైరల్ అయింది.
దీనిపై విజయ్ వర్మ క్లారిటీ ఇస్తూనే ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపాడు. విజయ్ వర్మ, అలియాభట్ కలిసి గతంలో డార్లింగ్స్ అనే సినిమాని చేశారు. ఈ సినిమాలో వాళ్లిద్దరూ భార్యాభర్తలుగా నటించారు. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరికి పెళ్లి అయినట్టు ఫోటోలు తీశారు. ఇప్పుడు తమన్నాతో లవ్ గురించి బయటపెట్టడంతో కొంతమంది ఈ ఫోటోని వైరల్ చేశారు.
NTR : మరో బ్రాండ్‌కి అంబాసిడర్‌గా ఎన్టీఆర్.. త్వరలో యాడ్ రిలీజ్..
అయితే విజయ్ వర్మ దీనిపై స్పందిస్తూ.. ఆ ఫోటో డార్లింగ్స్ సినిమా సమయంలోనిది. సినిమాలో ఫోటోఫ్రేమ్ వాడటానికి మా ఇద్దర్ని పెళ్లి బట్టల్లో ఫోటో తీశారు. నేను సరదాగా ఆ ఫోటోని మా అమ్మకు చూపించాను. దీంతో మా అమ్మ చెప్పకుండా పెళ్లి చూసుకున్నావా అంటూ తిట్టింది అని తెలిపాడు. మొత్తానికి విజయ్ వర్మ – అలియా భట్ పెళ్లి ఫోటో సినిమా షూటింగ్ కోసం తీసిందని క్లారిటీ ఇచ్చాడు.