Japan OTT Release : ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న జపాన్ మూవీ..

జపాన్ మేడ్ ఇన్ ఇండియా అంటూ దీపావళికి వచ్చిన కార్తీ మూవీ.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

Japan OTT Release : ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న జపాన్ మూవీ..

Tamil Hero Karthi new released movie Japan OTT Release date update

Updated On : December 4, 2023 / 6:43 PM IST

Japan OTT Release : కోలీవుడ్ హీరో కార్తి తన 25వ చిత్రంగా ‘జపాన్’ని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. హైస్ట్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాని ‘జోకర్’ సినిమా ఫేమ్ రాజు మురుగన్ డైరెక్ట్ చేశారు. అను ఇమ్మాన్యుయేల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ అండ్ టీజర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా కోసం కార్తీ డిఫరెంట్ గెటప్, స్లాంగ్, బాడీ లాంగ్వేజ్ తో రావడం ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్నాయి.

దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్స్ లో తుస్స్ అంది. కార్తీ బెంచ్ మార్క్ మూవీ కావడం, డిఫరెంట్ రోల్ తో కార్తీ అక్కటుకోవడంతో ఆడియన్స్ ఈ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలను జపాన్ రీచ్ అవ్వడంలో ఫెయిల్ అయ్యింది. థియేటర్ లో పేలని ఈ జపాన్.. ఇప్పుడు ఓటీటీలో పేలడానికి సిద్దమవుతుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమ్ కాబోతుంది. డిసెంబర్ 11 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రాబోతుంది.

Also read : Animal Movie : ఆమీర్ ఖాన్ ఓల్డ్ వీడియోతో ‘యానిమల్’ని ట్రోల్ చేస్తున్న బాలీవుడ్..

 

View this post on Instagram

 

A post shared by Netflix India (@netflix_in)

ఇక కార్తీ కొత్త సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘వా వాథియారే’ అనే సినిమాలో నటిస్తున్నారు. కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నారు. మరి ఈ సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రంతో పాటు కార్తీ లైనప్ లో ఖైదీ, సర్దార్ కూడా సీక్వెల్స్ ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు కోసం తమిళ్ ఆడియన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు సెట్స్ పైకి వెళ్లనున్నాయని కార్తీ చెబుతున్నారు. మరి ఈ రెండు ప్రాజెక్ట్స్ లో ఏది ముందు ఆడియన్స్ ముందుకు వస్తుందో చూడాలి.