Vijay : మరోసారి అభిమానులతో విజయ్ భేటీ.. రాజకీయం గురించేనా..?
తమిళ్ హీరో విజయ్ మరోసారి అభిమానులతో సమావేశం అయ్యాడు. తమిళనాడులోని 15 జిల్లాలకు చెందిన అభిమాన మరియు ప్రజా సంఘాలతో..

Tamil star hero Vijay again meeting with his fans in chennai
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గత కొంతకాలంగా తమిళనాట హాట్ టాపిక్ గా మారిపోయాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయానికి విజయ్ రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నాడు అంటూ గట్టిగా వినిపిస్తుంది. విజయ్ ఇన్నాళ్లు సినిమాల్లో నటిస్తున్నప్పటికీ అడపాదడపా రాజకీయంగా చర్చనీయాంశం అయ్యేవాడు. ప్రభుత్వం చేసే తప్పులను వేలెత్తి చూపిస్తూ సినిమాలోనే కాదు రియల్ లైఫ్ లోను అన్యాయాన్ని నిలదీసే హీరో అనిపించుకున్నాడు. అంతేకాకుండా తన ఫ్యాన్స్ తో కలిసి ఎన్నో సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుంటాడు.
Nani30 : ఆకాశంలో విహరిస్తూ అప్డేట్ ఇచ్చిన నాని.. ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్..!
ఇక ఇటీవల తమిళనాడులోని 234 నియోజకవర్గాలకు చెందిన 10వ తరగతి మరియు ప్లస్–1, ప్లస్–2 తరగతుల్లో మొదటి 3 ర్యాంక్ లు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ వారి తల్లిదండ్రులతో కూడా సత్కరించాడు. ఈ సమావేశంలోనే విజయ్ మాట్లాడుతూ.. ఓటు అనేది ఒక శక్తివంతమైన ఆయుధమని, దానిని డబ్బుకి అమ్ముకోవద్దని తనదైన శైలిలో తెలియజేశాడు. ఈ వ్యాఖ్యలు, సమావేశం రాజకీయంగా పెద్ద చర్చ అయ్యింది. అయితే
విజయ్ ఇప్పుడు మరోసారి తన అభిమానులను చైన్నెలోని తన ఆఫీస్ లో కలుసుకున్నాడు.
Katrina Kaif : గత 20 ఏళ్లగా నా లైఫ్‌లోని ఎక్కువ సమయం అతనితో ఉన్నాను.. కత్రినా పోస్ట్ ఎవరి గురించి?
ఈ మంగళవారం (జులై 13) నాడు 15 జిల్లాలకు చెందిన అభిమాన మరియు ప్రజా సంఘాలను విజయ్ కలుసుకున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సమావేశంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలు మరియు రాజకీయ పరమైన అంశాల పై చర్చ జరిగినట్లు తమిళనాట వార్తలు వస్తున్నాయి. అయితే కొంతమంది అభిమానులు మాత్రం ఇది రాజకీయ సమావేశం కాదు, విజయ్ నిర్వహించే సేవ కార్యక్రమాల సమావేశం అని చెప్పుకొస్తున్నారు. మరి విజయ్ పొలిటికల్ ఎంట్రీ న్యూస్ లో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.