Bigg Boss 4 Promo : వృద్ధుడి వేషంలో నాగ్

తెలుగు బిగ్ బాస్ – 4 ప్రోమో వచ్చేసింది. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున వేషం చూసి షాక్ తిన్నారు. వృద్ధుడి వేషంలో ఆయన కనిపిస్తున్నారు. తెల్లటి గడ్డం, తెల్లటి జట్టు, కళ్లద్దాలు ధరించాడు. పాతకాలంలో దూరం వస్తువులను చూసే (బూతద్దం) వస్తువును ఉపయోగించి..హౌస్ లోకి చూస్తూ కనిపించాడు.
గోపి అనడం..ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా అంటూ నాగ్ ను చూపించారు. త్వరలోనే వస్తుందని వెల్లడించారు మా టివి. 2020, ఆగస్టు 13వ తేదీ బుధవారం రోజున స్టార్ మా రిలీజ్ చేసింది.
Next em jarugutundo chudataniki stay tuned!!!#BiggBossTelugu4 coming soon on @StarMaa pic.twitter.com/hdkyJe6FuL
— starmaa (@StarMaa) August 12, 2020
Bigboos – 4 ఎప్పుడెప్పుడు ప్రసారం అవుతుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. కానీ..కరోనా టైంలో జరుగుతుందా అనే ఉత్కంఠకు స్టార్ మా తెరదించింది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేక సెట్ లో ప్రోమో చిత్రీకరించారు.
షూటింగ్ ను నాగ్ బర్త్ డే ఆగస్టు 29వ తేదీన ప్రారంభంచాలని అనుకుంటున్నారంట. ఈ షోలో పాల్గొనే కంటెస్ట్ కు కరోనా టెస్టులు నిర్వహించి పూర్తిగా ఆరోగ్యం ఉన్నారని డాక్టర్లు నిర్ధారించి తర్వాతే..హౌస్ లోకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో 100 రోజులు కాకుండా..ఈసారి 70 రోజుల్లోనే ముగించాలని అనుకుంటున్నారు.