Eagle : ‘ఈగల్’ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఎంత? హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి?

'ఈగల్' సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ రూ.21 కోట్లు జరిగినట్లు చర్చ జరుగుతోంది. మరో రూ.22 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ దిశగా అడుగులు వేసి ఈ సినిమా హిట్ కొడుతుందా?

Eagle : ‘ఈగల్’ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ఎంత? హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలి?

Eagle

Updated On : February 8, 2024 / 6:32 PM IST

Eagle : మాస్ మహరాజా రవితేజ ‘ఈగల్’ సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌కి సంబంధించి సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది.

Eagle : ‘ఈగల్’ క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా ఉంటుందట.. పవన్ కళ్యాణ్‌‌తో..

ఫిబ్రవరి 9న రవితేజ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఈగల్’ తో అభిమానులను పలకరించబోతున్నారు. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మించారు. కావ్యా తాపర్, అనుపమ పరమేశ్వరన్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Ravi Teja : అందరూ టికెట్ రేట్లు పెంచుతుంటే.. రవితేజ ‘ఈగల్’ మాత్రం పెంచకుండానే

మరికొన్ని గంటల్లో ఈగల్ సినిమాను వీక్షించడానికి ప్రపంచ వ్యాప్తంగా రవి తేజ అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌పై చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ.17 కోట్లు బిజినెస్ చేసింది. కర్నాటకతో పాటు ఇండియాలోని కొన్ని ప్రాంతాలు, ఓవర్సీస్ లెక్కల ప్రకారం రూ. 21 కోట్ల బిజినెస్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే మరో రూ.22 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబడితే సినిమా కమర్షియల్ హిట్ అయినట్లే.  ఇదే టార్గెట్‌తో రంగంలోకి దిగుతున్న రవితేజకు ఈగల్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచి చూడాలి.