RRR: ఆస్కార్‌కు అడుగు దూరంలో ‘ఆర్ఆర్ఆర్’.. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అవార్డులు గెలిచిందో తెలుసా?

ఇండియన్ ప్రెస్టీజియస్ మూవీగా ఆస్కార్ 2023 బరిలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో చోటు దక్కించుకన్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో దుమ్ములేపుతోంది. అందరి చూపులు ఈ సినిమాపైనే ఉండటంతో ఈ మూవీ ఖచ్చితంగా ఆస్కార్ అవార్డును దక్కించుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

RRR: ఆస్కార్‌కు అడుగు దూరంలో ‘ఆర్ఆర్ఆర్’.. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అవార్డులు గెలిచిందో తెలుసా?

These Are The Awards Won By RRR Ahead Of Oscars 2023

Updated On : March 11, 2023 / 9:23 PM IST

Oscars 2023: ఇండియన్ ప్రెస్టీజియస్ మూవీగా ఆస్కార్ 2023 బరిలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో చోటు దక్కించుకన్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో దుమ్ములేపుతోంది. అందరి చూపులు ఈ సినిమాపైనే ఉండటంతో ఈ మూవీ ఖచ్చితంగా ఆస్కార్ అవార్డును దక్కించుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించగా, కీరవాణి ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ఇక ఆస్కార్ అవార్డుకు ఒక్క అడుగు దూరంలో ఉన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలతో పాటు పలు ప్రెస్టీజియస్ అవార్డులు కూడా సొంతం చేసుకుంది. మరి ఆర్ఆర్ఆర్ మూవీ వరల్డ్‌వైడ్‌గా అందుకున్న ప్రెస్టీజియస్ అవార్డులు ఏమిటో ఒక్కసారి ఇక్కడ చూద్దాం.

Oscars95: ఆస్కార్స్ కోసం తన ఓటు వేశానంటోన్న స్టార్ హీరో..!

ఆర్ఆర్ఆర్ మూవీలోని పెప్పీ డ్యాన్స్ నెంబర్ ‘నాటు నాటు’ సాంగ్ కేవలం ఇక్కడి ఆడియెన్స్‌నే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులతో చిందులు వేయించింది. ఇంతలా పాపులర్ అయిన ఈ పాటకు ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ మోషన్ పిక్చర్ విభాగంలో ఈ పాటను గోల్డెన్ గ్లోబ్ అవార్డు వరించింది. దీంతో పాటు ప్రతిష్టాత్మకమైన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు కూడా నాటు నాటు సాంగ్‌కు దక్కింది. ఈ అవార్డుల్లో బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిలిం విభాగంలోనూ ఆర్ఆర్ఆర్ అవార్డును అందుకుంది.

Oscars 2023 : ఆస్కార్ అందుకున్న భారతీయులు ఎవరో తెలుసా?

ఈ అవార్డు తరువాత ఎంఎం.కీరవాణికి లాస్ ఏంజెల్స్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నుండి బెస్ట్ మ్యూజిక్ స్కోర్ విభాగంలో అవార్డు లభించింది. అటు న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ అవార్డుల్లోనూ ఆర్ఆర్ఆర్ అవార్డు అందుకుని సత్తా చాటింది. ఉటా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల్లో బెస్ట్ నాన్-ఇంగ్లీష్ ఫీచర్ అవార్డును ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకుంది. దీంతో పాటు అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డుల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్ అవార్డును అందుకుని ఆర్ఆర్ఆర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇన్ని అంతర్జాతీయ అవార్డుల్లో సత్తా చాటిన ఆర్ఆర్ఆర్, ఆస్కార్స్ 2023లోనూ ఖచ్చితంగా గెలుపొందుతుందని విశ్లేషకులు అంటున్నారు.