HANUMAN : హనుమాన్ నుంచి క్రేజీ అప్‌డేట్..
Third Single from HANUMAN : టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జ నటిస్తున్న చిత్రం హనుమాన్. తాజాగా మూడో సింగిల్‌కు సంబంధించిన అప్‌డేట్ వచ్చింది

Third Single from HANUMAN
టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జ నటిస్తున్న చిత్రం హనుమాన్. అమృత అయ్యర్ ఫీ మేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకుడు. 2024 జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఇటీవల చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఈ సినిమా నుంచి వరుసగా అప్‌డేట్‌లు ఇస్తూ వస్తోంది. ఇప్పటికే టీజర్, రెండు పాటలను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా మూడో సింగిల్‌కు సంబంధించిన అప్‌డేట్ వెల్లడించింది.
మంగళవారం సాయంత్రం 4.05 గంటలకు మూడో సాంగ్‌ను విడుదల చేయనున్నారు. ఓ సరికొత్త పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని చిత్ర బృందం వెల్లడిచింది. ఓ చేతిలో కత్తి, మరో చేతిలో గొడ్డలి పట్టుకుని సరికొత్త వేషదారణలో వేటాడేందుకు వెలుతున్న పోస్టర్‌ను చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి.
Mahesh Babu : యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిల్ కపూర్‌తో కలిసి మహేష్ బాబు డాన్స్..
వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషిస్తుండగా ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్ లు సంయుక్తంగా సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ లాంగ్వేజ్స్ తో పాటు శ్రీలంక, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, స్పెయిన్, జర్మనీ.. ఇలా వరల్డ్ వైడ్ గా మొత్తం 11 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
కాగా ఈ సినిమా కథ విషయానికి వస్తే.. హనుమంతుడి వల్ల ఒక కుర్రాడికి సూపర్ పవర్స్ రావడం, ఆ తరువాత జరిగిన సంఘటనలు, ఆ కుర్రాడు ఎదుర్కొన్న విషయాలు ఈ మూవీలో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. జాంబిరెడ్డి తరువాత తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
Gangs Of Godavari : ‘గ్యాంగ్స్ అఫ్ గోదావరి’ పోస్టుపోన్.. కొత్త రిలీజ్ డేట్ ఏంటంటే..?