Adipurush : ఆదిపురుష్ పై టాలీవుడ్ రాముడు కామెంట్స్.. ప్రభాస్‌ను నేను అంగీకరించలేకపోయా..
ప్రభాస్ ఆదిపురుష్ సినిమా టాలీవుడ్ రాముడు సుమన్ మాట్లాడారు. మీసంలో ప్రభాస్‌ను నేను అంగీకరించలేకపోయాను..

tollywood actor Suman comments on Prabhas Adipurush
Prabhas Adipurush : ప్రభాస్ రాముడిగా నటిస్తూ చేసిన సినిమా ఆదిపురుష్. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut) తెరకెక్కించిన ఈ సినిమా భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయ్యి చివరికి విమర్శలు, వివాదాలు ఎదురుకుంటుంది. తాజాగా ఈ సినిమా గురించి టాలీవుడ్ రాముడు సుమన్ (Suman) మాట్లాడారు. ఎన్టీఆర్ తరువాత రాముడిగా మరొకర్ని ఉహించుకోలేని సమయంలో ‘శ్రీ రామదాసు’ సినిమాలో సుమన్ రాముడిగా కనిపించి అందర్నీ మెప్పించారు. తాజాగా సుమన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆయనని ఆదిపురుష్ గురించి ప్రశ్నించారు.
Adipurush : ఆదిపురుష్ టీంని నిలబెట్టి కాల్చేయాలి.. శక్తిమాన్ నటుడు ముకేష్ ఖన్నా..
సుమన్ మాట్లాడుతూ..
ఆదిపురుష్ టైటిల్ పెట్టడంతో సంపూర్ణ రామాయణం చూపిస్తారని అందరూ అనుకున్నారు. కానీ రామరావణ యుద్ధ ఘట్టం వరుకే చూపించడంతో ప్రేక్షకులు కొంత నిరుత్సాహ పడ్డారు. మూవీ టీం అయితే వారు అనుకున్న పోర్షన్ వరకు బాగా తెరకెక్కించారు. రామాయణం కొత్తగా చూపించే ప్రయత్నం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం మంచింది. పాత సినిమాల్లో ఒక బాణం వేస్తే.. 10 పైగా బాణాలు వచ్చేవి. కానీ ఈ చిత్రంలో ఒకే బాణంతో రాముడి పరాక్రమాన్ని చూపించడానికి ప్రయత్నించారు. రాముడు ఎంతో శక్తివంతుడు కానీ యుద్ధ సన్నివేశాల్లో అది సరిగ్గా చూపించలేకపోయారు.
ఇక ముఖ్యంగా పాత్రలు గెటప్పులు. రాముడు అంటే బ్లూ కలర్ లో ఉంటాడని, గడ్డం-మీసాలు ఉండవని ప్రేక్షకులకు బాగా అలవాటు అయ్యిపోయాయి. ఆడియన్స్ వాటిని అంగీకరించలేకపోయారు. అయితే నా వరకు ప్రభాస్ ని నార్మల్ గా చూపించడం నచ్చింది. రాముడిగా ప్రభాస్ తన ఆహార్యాన్ని చాలా చక్కగా మలుచుకున్నారు. అయితే మీసంలో ప్రభాస్‌ను నేను అంగీకరించలేకపోయాను. అయితే అది దర్శకుడు తప్పు. ఇలా ప్రయత్నం చేసే పనిలో కొన్ని తప్పులు చేయడంతో నేడు తీవ్ర విమర్శలు ఎదురుకుంటుంది. లేకుంటే ఆదిపురుష్ ఇంటర్నేషనల్ ఫిలిం అయ్యి ఉండేది.