Drug Case : ఈడీ విచారణ, హాజరు కానున్న పూరీ జగన్నాథ్

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో దూకుడు పెంచింది ఈడీ. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ 2021, ఆగస్టు 31వ తేదీ మంగళవార ఈడీ ఎదుట హాజరు కానున్నారు.

Drug Case : ఈడీ విచారణ, హాజరు కానున్న పూరీ జగన్నాథ్

Puri

Updated On : August 30, 2021 / 12:03 PM IST

 Puri Jagannadh : టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో దూకుడు పెంచింది ఈడీ. ఈ కేసులో కోర్టులో ఈసీఐఆర్‌ (ECIR) నమోదు చేసింది. అవసరమైతే తారల ఆస్తుల జప్తుకు సిద్ధమవుతోంది. మరోవైపు ఈనెల 31 నుంచి విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేయడంతో.. టాలీవుడ్‌లో మళ్లీ కలవరం మొదలైంది. ఈ క్రమంలో..ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ 2021, ఆగస్టు 31వ తేదీ మంగళవార ఈడీ ఎదుట హాజరు కానున్నారు. సెప్టెంబర్ 22వ తేదీ వరకు నోటీసులు ఇచ్చిన వారిని విడతలవారీగా విచారించనున్నారు.

Read More : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ వద్ద కీలక ఆధారాలు

విచారలో తేలే అంశాల ఆధారంగా సోదాలు, అరెస్టులు చేసే అవకాశం ఉంది. 12మందికి ఈ నోటీసులు అందాయి. దీంతో  మంగళవారం నుంచి ఈడీ విచారణ మొదలుకానుంది. 12మంది తారలతోనే ఈ విచారణ ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. వీరిచ్చే సమాచారం ఆధారంగా మరికొంత మందిని విచారించే అవకాశముంది. విచారణలో తేలే అంశాల ఆధారంగా సోదాలు చేసి.. ఆస్తులు జప్తు చేసే అవకాశముంది.

Read More : ED Summons : డ్రగ్స్ కేసు..ఈడీ రంగంలోకి దిగడానికి ప్రధాన కారణాలు ఇవే

జులై 2017లో టాలీవుడ్ ప్రముఖులతో సహా 62 మంది అనుమానితుల నుంచి  సిట్‌… రక్త నమూనాలు, తల వెంట్రుకలు, గోర్ల నమునాలు సేకరించింది. వాటిని ఎఫ్ఎస్ఎల్‌కు పంపించింది. ఎఫ్‌ఎఎస్‌ఎల్‌ రిపోర్ట్‌ ఆధారంగా ఈడీ విచారించనుంది. సినీ తారల డ్రగ్స్‌ రాకెట్‌ లావాదేవీలపై ఈడీ ఫోకస్‌ పెట్టనుంది. నిధులు విదేశాలకు ఎలా మళ్లించారన్న దానిపై ఈడీ వివరాలు రాబట్టనుంది.

Read More : Tollywood Drug Scandal : టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఎప్పుడు, ఎలా మొదలైంది.. మళ్లీ తెరపైకి ఎందుకంటే?

కెల్విన్‌ అరెస్ట్‌తో టాలీవుడ్‌ డ్రగ్స్‌ లింక్స్‌లు బయటపడ్డాయి. అప్పట్లో 30 లక్షల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న ఈడీ.. షికాగో ఇంటర్నేషనల్‌ డ్రగ్స్‌ రాకెట్‌తో సంబంధాలు గుర్తించింది. ఆస్ట్రియా, దక్షిణాఫ్రికా నుంచి సైతం డ్రగ్స్‌ సప్లై అయినట్టు తెలుస్తోంది. దీనిపైనే ఈడీ విచారణ జరుగనుంది. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.