Tollywood : టాలీవుడ్‌లో కూడా ఘనంగా న్యూ ఇయర్‌ వేడుకలు..

టాలీవుడ్‌ FNCC పాత సంవత్సరానికి గ్రాండ్ గుడ్ బై చెబుతూనే, కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికారు.

Tollywood : టాలీవుడ్‌లో కూడా ఘనంగా న్యూ ఇయర్‌ వేడుకలు..

Tollywood film nagar culture centre organise new year bash

Updated On : December 31, 2023 / 9:29 PM IST

Tollywood : 2023కి మరికొన్ని గంటల్లో వీడ్కోలు పలకబోతున్నాము. ఇక 2024కి ఘానా స్వగతం పలికేందుకు ప్రతి ఒక్కరు సిద్ధం అవ్వుతున్నారు. సాధారణ ప్రజలు నుంచి సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో బిజీ అవుతున్నారు. ఈక్రమంలోనే టాలీవుడ్ ఫిల్మ్‌నగర్‌ కౌన్సిల్ కూడా నూతన సంవత్సరం వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు. ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి.

ఈ ఈవెంట్ లో ఎఫ్‌‌ఎన్‌సీసీ (FNCC) మెంబెర్స్ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఇక ఎంటర్టైన్మెంట్ నైట్ ని ఇనఫ్యూజన్ బ్యాండ్‌ హోస్ట్ చేసింది. సంగీత విభావరి, జోడీ డాన్స్, బెలీ డాన్స్, 30 మంది ముంబై డాన్సర్స్ చేసిన ఎరోబిక్స్‌ డాన్స్ ఆహుతులను అలరించాయి. ఈ గ్రాండ్ ఈవెంట్ తో పాత సంవత్సరానికి గ్రాండ్ గుడ్ బై చెబుతూనే, కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికారు.

Also read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్‌కి అలాంటి అలవాటు ఉందని.. ఎవరూ అనుకోరు.. శృతిహాసన్ కామెంట్స్

ఇక ఈ ఈవెంట్ లో సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి మాట్లాడుతూ.. గతంలో ఉన్న కమిటీ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్‌ను ఎంతో అభివృద్ధి చేసింది. మేము కూడా అదే దిశగా ముందుకు తీసుకువెళ్తాము. దక్షిణాదిలో నంబర్ వన్ కల్చరల్ సెంటర్‌గా FNCC ని తీర్చిదిద్దుతాం” అని వెల్లడించారు.

Tollywood film nagar culture centre organise new year bash

Tollywood film nagar culture centre organise new year bash