ఈ హీరోలకు విలన్లు కావాలి

హీరోయిజం ఎలివేట్ అవ్వాలంటే విలన్ కావాలి.. అసలు హీరో.. హైలెట్ అవ్వాలంటే విలన్ ఉండాల్సిందే. మొన్న మొన్నటి వరకూ లోకల్ విలన్స్ ని, సౌత్ నుంచి తెచ్చుకున్న వాళ్లని, బాలీవుడ్ వాళ్లని కూడా విలన్స్ గా వాడేయడంతో ఇప్పుడు కొత్త విలన్స్ దొరకడం కష్టమైపోతోంది మన సినిమాలకు. అలా ఇప్పుడు తెలుగులో చాలా సినిమాల్లో మాకు విలన్లు కావలెను అంటూ వేకెన్సీ బోర్డ్ తగిలించారు మేకర్స్.
ఆచార్య సినిమా : –
ఆల్రెడీ 40 పర్సెంట్ షూటింగ్ అయిపోయిన ‘ఆచార్య’ సినిమాకు ఇప్పటి వరకూ విలన్ ఎవరో ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఆల్రెడీ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాలో విలన్ గా మోహన్ బాబుని అడిగితే .. చిరంజీవితో పాటు సమానంగా ఉండేలా పవర్ ఫుల్ రోల్ అయితేనే చేస్తానని కండిషన్ పెట్టారన్న వార్తలు టాలీవుడ్ లో వినిపించాయి. అయితే ఇప్పటి వరకూ చిరంజీవి సినిమాలో విలన్ మాత్రం కన్ ఫామ్ కాలేదు.
బాలకృష్ణ – బోయపాటి : –
బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ గా తెరెకెక్కుతున్న సినిమాలో కూడా ఇప్పటివరకూ విలన్ దొరకలేదు. ఈ సినిమాలో ఫస్ట్ .. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి, సంజయ్ దత్ ల్లో ఒకరు విలన్‌గా చేస్తారన్న టాక్ వినిపించింది. అసలే బాలయ్య – బోయపాటి సినిమాల్లో యాక్షన్ ఎలివేషన్ ఎక్కువే ఉంటుంది కాబట్టి… ఆ రేంజ్ ని మ్యాచ్ చేసే విలన్ ఇంకా వెతుకుతున్నాం అంటున్నారు యూనిట్.
ప్రభాస్ జాన్ : –
ప్రభాస్ మూవీ ‘జాన్’ సినిమాకు కూడా ఇంకా విలన్ ఎవరో క్లారిటీ లేదు. పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతున్న బాలీవుడ్ స్టార్ మిధున్ చక్రవర్తి విలన్ గా చెయ్యబోతున్నారంటూ టాక్ నడిచింది. కానీ ఇప్పటి వరకూ ఈ విషయంపై ఎలాంటి న్యూస్ రాలేదు.
విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ : –
యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పూరీ డైరెక్షన్లో వస్తున్న ‘ఫైటర్’ మూవీలో కూడా ఇంకా విలన్ ఎవరో కన్ఫామ్ చెయ్యలేదు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఫైటర్ సినిమాలో విజయ్ తో ఫైటింగ్ చేసేదెవరా అని వెయిట్ చేస్తున్నారు.
బన్నీ ‘పుష్ప’ : –
సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న ‘పుష్ప’ సినిమాకు కూడా విలన్ల కోసం వెతుకుతున్నారు. బన్నీకి విలన్ గా విజయ్ సేతుపతి ని ఫిక్స్ చేశారు. కానీ డేట్స్ క్లాష్ తో పాటు రెమ్యూనరేషన్ ప్రాబ్లమ్ అవ్వడంతో వేరే విలన్ కోసం ట్రై చేస్తున్నారని టాక్. ఈ లిస్ట్ లో బాబీ సింహతో పాట రోజా పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి ఎవరిని ఫైనల్ చేస్తారో చేస్తారో సుకుమార్ అండ్ టీమ్.
సర్కార్ వారి పాట : –
మహేష్ బాబు – పరశురామ్ లేటెస్ట్ గా స్టార్ట్ చేసిన ‘సర్కార్ వారి పాట’ సినిమాకు కూడా ఇంకా విలన్ ఫైనల్ కావాల్సి ఉంది. మహేష్ బాబుకు పవర్ ఫుల్ విలన్స్ ని మ్యాచ్ చేస్తున్న డైరెక్టర్లు.. ఇప్పుడు ఎవరితో సూపర్ స్టార్ ను ఫైటింగ్ చెయ్యమంటారో చూడాలి. ఇలా స్టార్ హీరోల సినిమాలకు విలన్లు కరువైపోయారు. మన హీరోలకు ధీటుగా స్క్రీన్ కి ఫ్రెష్ గా ఏ విలన్ ని పెడదామా అని విలన్ల కోసం వెతుక్కుంటున్నారు మేకర్స్.
Read: తొందరపడితే నష్టమే, రోగం తిరగబెట్టొచ్చు.. థియేటర్ల రీఓపెన్ పై పెద్దల హెచ్చరిక