Tollywood Movies: సెప్టెంబర్ 28.. టాలీవుడ్ చూపంతా దీనిపైనే.. ప్రభాస్ వల్లే..
సలార్ సినిమా తప్పుకోగానే అదే తేదీన విడుదల కావడానికి పలు సినిమాలు రెడీ అయ్యాయి.

Tollywood Movies
Tollywood Movies – Prabhas: ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో ఏ రిలీజ్ డేట్‌కీ లేనంత క్రేజ్, పోటీ.. సెప్టెంబర్ 28కి ఉంది. సలార్ (salaar) సినిమా తప్పుకుందో లేదో.. ఎప్పుడో రిలీజ్ అనౌన్స్ చేసి.. ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేసిన సినిమాలు.. ఇప్పుడు పోస్ట్ పోన్ చేసుకుని సెప్టెంబర్ 28కే రిలీజవుతున్నాయి. ఇప్పటికే బాగా టఫ్ కాంపిటీషన్ ఉంటే.. లేటెస్ట్ గా మరో సినిమా కూడా రిలీజ్ పోస్ట్ పోన్ చేసకుని సలార్ డేట్ నే ఫిక్స్ చేసుకుంది.
ప్రభాస్ పక్కకి తప్పుకునే సరికి.. అందరు హీరోలూ.. ప్రభాస్ ప్లేస్ లోకి రావడానికే రెడీ అయ్యారు. ఆల్రెడీ సెప్టెంబర్ లో సలార్ కంటే ముందే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసుకున్న సినిమాలు కూడా ఆ డేట్ క్యాన్సిల్ చేసుకుని సెప్టెంబర్ 28కే పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి. లేటెస్ట్ గా చంద్రముఖి 2 కూడా ఈ లిస్ట్ లో జాయిన్ అయ్యింది.
ఆల్రెడీ సెప్టెంబర్ 15 వినాయకచవితి సీజన్ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి చెన్నైలో ఈవెంట్స్ తో హడావిడి చేస్తున్న చంద్రముఖి 2.. తెలుగులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈనెల 11 న అరేంజ్ చేస్తున్నట్టు అనౌన్స్ కూడా చేసింది. కానీ.. ఇప్పుడు సలార్ డేట్ కే షిఫ్ట్ అయినట్టు చెబుతోంది టీమ్.
సలార్ పోస్ట్ పోన్ అని తెలియగానే.. ఒక్కొక్కరు వరసగా ఆ డేట్ నే లాక్ చేసుకోవడంతో టఫ్ ఫైట్ ఫేస్ చెయ్యబోతున్నాయి ఈ సినిమాలు. రకరకాల డేట్లు మార్చుకుని ఆఖరికి సెప్టెంబర్ 15 రిలీజ్ అని డేట్ ఫిక్స్ చేసకున్న రామ్ స్కంద మూవీ.. ఇప్పుడు తూచ్ .. సలార్ డేట్ కే వస్తున్నామంటూ ఫ్రెష్ డేట్ అనౌన్స్ చేసింది. ఇంతకన్నా మంచి డేట్ ఉండదని , అందుకే సినిమాని 15 నుంచి పోస్ట్ పోన్ చేసి 28న రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
చంద్రముఖి-2, స్కందతో పాటు..
ఒక పక్క చంద్రముఖి 2, మరో పక్క స్కంద.. ఈ ఇంట్రస్టింగ్ మూవీస్ మధ్యే పోటీ అనుకుంటే.. ఈ పోటీలోకి నేను కూడా.. తగ్గేదే లే.. అంటున్నాడు కిరణ్ అబ్బవరం. ఇప్పటి వరకూ పెద్దగా అంచనాలు లేవు కానీ .. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే .. ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా అంటున్నారు ప్రేక్షకులు.
లాంగ్ వీకెండ్ కాబట్టి.. రూల్స్ రంజన్ కూడా సలార్ డేట్ కే రాడానికి ఫిక్సయ్యింది. ఈ సినిమాలతో పాటు మొన్నీమధ్యే సలార్ డేట్ కి వస్తున్నామంటూ అనౌన్స్ చేసిన సినిమా మ్యాడ్. ఈ మూవీ కూడా యూత్, స్టూడెంట్స్ ని టార్గెట్ చేస్తూ.. రిలీజ్ రిలీజవుతోంది. మ్యాడ్.. రూల్స్ రంజన్ తో పాటు మిగిలిన సినిమాల్ని ఎలా దాటుతుందో చూడాలంటున్నారు ప్రేక్షకులు.
సౌత్ సినిమాలతో పాటు పాన్ ఇండియా లైవల్లో రిలీజవుతున్న బాలీవుడ్ మూవీ వాక్సిన్ వార్ పనిగట్టుకుని సలార్ కి ఫైట్ ఇవ్వడానికి రెడీ అయ్యింది. నిజానికి ఈ సినిమా ఆగస్ట్ లో రిలీజ్ అవ్వాల్సి ఉంటే.. పోస్ట్ పోన్ అయ్యి సెప్టెంబర్ 28న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది.
వివేక్ అగ్నిహోత్రి చేసిన కశ్మీర్ ఫైల్స్.. సౌత్ లో కూడా బాగానే ఆడడంతో.. వాక్సిన్ వార్ మీద కూడా అంచనాలు బాగా ఉన్నాయి. అందుకే బాలీవుడ్ మూవీ అయినా.. వాక్సిన్ వార్ కూడా గట్టిపోటీ ఇస్తుందనడంలో ఏ మాత్రం డౌట్ లేదంటున్నారు జనాలు. ఇలా సెప్టెంబర్ 28న ధియటర్లో టఫ్ ఫైట్ ఫేస్ చెయ్యబోతున్నాయి ఈ సినిమాలు.