Mission Impossible 7 : మిషన్ ఇంపాజిబుల్ 7 ట్రైలర్ వచ్చేసింది.. టామ్ క్రూజ్ స్టంట్స్ మాములుగా లేవు!
టామ్ క్రూజ్ మిషన్ ఇంపాజిబుల్ 7 ట్రైలర్ వచ్చేసింది. ఇక ట్రైలర్ లో టామ్ క్రూజ్ స్టంట్స్, కారు ఛేజింగ్స్, యాక్షన్ సీక్వెన్స్..

Tom Cruise Mission Impossible 7 Part One Trailer Released
Tom Cruise Mission Impossible 7 : హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ కి ప్రపంచం మొత్తం అభిమానులు ఉంటారు. సినిమాల్లో తను చేసే యాక్షన్ సీన్స్ కి ప్రతి ఒక్కరికి గూస్‌బంప్స్ రావాల్సిందే. ఇక టామ్ క్రూజ్ సినిమాల్లో ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్ కి ఒక ప్రత్యేక స్తానం ఉంటుంది. మార్వెల్ సినిమాలు తరువాత ఇండియన్ మూవీ లవర్స్ ఎక్కువగా ఇష్టపడే హాలీవుడ్ మూవీ మిషన్ ఇంపాజిబుల్ సిరీస్ అనడంలో ఎటువంటి సందేహం ఉండదు. ఇప్పటికే మిషన్ ఇంపాజిబుల్ నుంచి 6 భాగాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి.
NTR30 : ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్.. బర్త్ డేకి గిఫ్ట్ రెడీ!
ఇప్పుడు 7వ బాగానే రెడీ చేస్తున్నాడు టామ్ క్రూజ్. అయితే ఈసారి ఆడియన్స్ కి డబల్ ట్రీట్ ఇవ్వడానికి ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నాడు. ఈ ఫస్ట్ పార్ట్ జులై 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఇక ఇటీవల ఈ సినిమా కోసం టామ్ క్రూజ్ చేసిన సాహసాన్ని మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. 60 ఏళ్ళ వయసులో టామ్ క్రూజ్ బైక్ తో కొండ పై నుంచి కిందకి దూకడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.
ఇక ట్రైలర్ లో టామ్ క్రూజ్ స్టంట్స్, కారు ఛేజింగ్స్, యాక్షన్ సీక్వెన్స్ మాములుగా లేవు. మునపటి సినిమాల కంటే ఈ మూవీ మరింత యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తుంది. మిషన్ ఇంపాజిబుల్ 5, 6 అండ్ టాప్ గన్ మావెరిక్ చిత్రాలను డైరెక్ట్ చేసిన క్రిస్టోఫర్ మెక్ క్వారీ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ ఫస్ట్ పార్ట్ ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకనింగ్’ అనే టైటిల్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.