SSMB28: మహేష్ కోసం త్రివిక్రమ్ ఆ సెంటిమెంట్‌ను పట్టుకొస్తున్నాడా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ ను ప్రధాన అంశంగా చూపెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.

SSMB28: మహేష్ కోసం త్రివిక్రమ్ ఆ సెంటిమెంట్‌ను పట్టుకొస్తున్నాడా..?

Trivikram To Bring Mother Sentiment For SSMB28

Updated On : April 24, 2023 / 5:04 PM IST

SSMB28: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్ట్స్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఈ సినిమాలో మహేష్ ఓ సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు.

SSMB28: టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో ల్యాండ్ అవుతున్న బాబు.. మామూలుగా ఉండదట!

కాగా, ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో పలు ఇంట్రెస్టింగ్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాలో మహేష్ సరికొత్త లుక్‌తో కనిపిస్తుండగా, ఈ సినిమాను త్రివిక్రమ్ తనదైన మార్క్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను త్రివిక్రమ్ మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడట. ఈ సినిమాలో అమ్మ సెంటిమెంట్‌ను ప్రధాన అంశంగా.. సినిమా కథలో అమ్మ సెంటిమెంట్‌ను చాలా ఎమోషనల్‌గా చూపెట్టనున్నాడట త్రివిక్రమ్. అయితే, ఈ సినిమాలో అమ్మ పాత్రలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి లేదా బాలీవుడ్ నటి రేఖను తీసుకురావాలని ఆయన ప్లాన్ చేస్తున్నాడట.

SSMB28: మహేష్ పాత్ర అలాంటిదా.. త్రివిక్రమ్ ట్రాజెడీని ఇస్తాడా..?

ఒకవేళ ఇదే నిజమైతే, మహేష్ నుండి ఓ పక్కా కమర్షియల్ మూవీని మనం త్వరలో చూడబోతున్నాం. కేవలం మాస్ అంశాలే కాకుండా, మదర్ సెంటిమెంట్‌తో ఎమోషనల్ కంటెంట్ కూడా ఇచ్చేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తుండగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.