NBK107: బాలయ్య సినిమా కోసం రెండు పవర్‌ఫుల్ టైటిల్స్.. ఏమిటంటే..?
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. బాలయ్య నటిస్తున్న ఈ సినిమాకు రెండు పవర్‌ఫుల్ టైటిల్స్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Two Powerful Titles For NBK107
NBK107: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, వీడియో గ్లింప్స్‌లు ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
NBK107: సంక్రాంతి బరి నుండి బాలయ్య వెనకుడుగు వేస్తాడా..?
ఈ క్రమంలో బాలయ్య నటిస్తున్న ఈ సినిమాకు రెండు పవర్‌ఫుల్ టైటిల్స్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందా, ఈ మూవీ టైటిల్‌తోనే చెప్పే ప్రయత్నం చిత్ర యూనిట్ చేస్తోందట. అందుకే ఈ సినిమాకు ‘రెడ్డిగారు’, ‘వీర సింహా రెడ్డి’ అనే రెండు టైటిల్స్‌ను చిత్ర యూనిట్ పరిశీలిస్తోందట. ఈ రెండింటిలో ఒక టైటిల్‌ను వారు ఓకే చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
NBK107: భారీ రేటుకు అమ్ముడైన బాలయ్య సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్..?
ఈ రెండు టైటిల్స్ కూడా పవర్‌ఫుల్‌గా ఉన్నాయంటూ అభిమానులు అంటున్నారు. ఇక ఈ సినిమాతో బాలయ్య మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ మూవీలో బాలయ్య సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.