Vibhu Agarwal : మొన్నటిదాకా రక్తి.. ఇప్పుడు భక్తి.. డెవోషినల్ ఓటీటీ తీసుకురాబోతున్న ఉల్లు ఓటీటీ ఓనర్..
తాజాగా ఉల్లు, ఆత్రాంగి ఓటీటీల అధినేత విభు అగర్వాల్ నుంచి మరో ఓటీటీ రాబోతుంది.
ULLU Ott Owner Vibhu Agarwal Launched Hari Om Devotional OTT
Vibhu Agarwal : కరోనా తర్వాత ఇండియాలో ఓటీటీ(OTT) వాడకం బాగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ ఓటీటీలతో పాటు లోకల్ ఓటీటీలు కూడా చాలా వచ్చాయి. ఓటీటీలకు సెన్సార్ నిబంధలనలు లేకపోవడంతో కొన్ని అడల్ట్ కంటెంట్ ఓటీటీలు కూడా పుట్టుకువచ్చాయి. ప్రస్తుతం చాలా అడల్ట్ కంటెంట్ ఓటీటీలు ఉన్నాయి. వాటిలో ఉల్లు ఓటీటీ ఒకటి. మాములు కంటెంట్ షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో పాటు అడల్ట్ కంటెంట్ కూడా ఉల్లు(ULLU) ఓటీటీలో ఎక్కువగా ఉంటుంది. ఈ ఓటీటీ బాగానే వైరల్ అయింది.
తాజాగా ఉల్లు, ఆత్రాంగి ఓటీటీల అధినేత విభు అగర్వాల్ నుంచి మరో ఓటీటీ రాబోతుంది. అయితే ఇన్నాళ్లు అడల్ట్ కంటెంట్ తో ఓటీటీలు నడిపి ఇప్పుడు భక్తి కంటెంట్ తో రాబోతున్నారు. ‘హరి ఓం'(Hari Om) అనే పేరుతో సరికొత్త ఓటీటీని మొదలుపెట్టనున్నట్టు ప్రకటించారు విభు అగర్వాల్. ఈ ఓటీటీలో భక్తి కంటెంట్, మన పురాణాలు, చరిత్రలోని భక్తి కథలు.. ఇలాంటి ఫ్యామిలీ కంటెంట్ ని స్ట్రీమింగ్ చేస్తామని తెలిపారు. త్వరలోనే ఈ ఓటీటీ అందుబాటులోకి రానుంది.
Also Read : Nindha Teaser : వరుణ్ సందేశ్ ‘నింద’ టీజర్ చూశారా? ఈసారి వరుణ్ సందేశ్ హిట్ కొట్టేలాగే ఉన్నాడు..
దీంతో ఈ హరి ఓం ఓటీటీ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇన్నాళ్లు ఉల్లు, ఆత్రాంగి ఓటీటీలతో అడల్ట్ కంటెంట్ అందించిన విభు అగర్వాల్ ఇప్పుడు డెవోషినల్ కంటెంట్ మొదలుపెట్టడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
