అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఫస్ట్ ఎపిసోడ్ ప్రొమో వచ్చేసింది..
బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 25న రాత్రి 8.30 గంటల నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

Unstoppable with NBK Season 4
బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 25న రాత్రి 8.30 గంటల నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇక ఫస్ట్ ఎపిసోడ్‌కు అతిథిగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వచ్చారు. ఇందుకు సంబంధించిన ప్రొమో వచ్చేసింది.
అభిమానులు వేరు, బాలయ్య వేరు కాదు.. అభిమానులు, బాలయ్య ఒక్కరే అంటూ బాలకృష్ణ డైలాగ్‌తో ప్రొమో ప్రారంభమైంది. వివిధ గెటప్స్‌లో బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు. మొదటగా చంద్రబాబుతో అన్‌స్టాపబుల్ బుక్ పై ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మీ చామత్కారం మీది, మా సమయస్ఫూర్తి మాది అని చంద్రబాబు అన్నారు.
Vikrant Massey : భార్య కాళ్లు మొక్కిన హీరో.. ఎవరో తెలుసా?
ఇక జైలులో తాను ఎదుర్కొన్న కష్టాలను చంద్రబాబు వివరించారు. మొదటి రాత్రి జైలులో ఎలా గడిపానో అలానే 53 రోజులు గడిపానని చంద్రబాబు చెప్పారు. తప్పు చేసిన వాళ్ళని ఎవ్వరిని వదిలి పెట్టననని అన్నారు. పవన్ కళ్యాణ్‌తో పొత్తు విషయం, పవన్‌తో ఏం మాట్లాడారు అనే విషయాలను బాబు చెప్పారు.
జైలు గోడలు మధ్య పవన్, నేను రెండు నిముషాలు మాట్లాడుకున్నాం. నూతన చరిత్ర రాయడానికి సమయస్ఫూర్తి గా నిర్ణయం తీసువడానికి ఒక హిస్టరికల్ డే అని చంద్రబాబు అన్నారు. వైజాగ్, విజయవాడ ఫోటోలను చూపిస్తూ ఇందులో ఓ ఛాయిస్‌ను ఎన్నుకోవాలని అనగా ఇందులో తన ఛాయిస్ పెట్టలేదని చంద్రబాబు తెలిపారు. ఇలా ఎన్నెన్నో విషయాలను చంద్రబాబు మాట్లాడారు. ఇంకెందుకు ఆలస్యం ఓ సారి వీడియోను మీరు చూసేయండి.