వారికోసం ఉపాసన ఆన్‌లైన్ టాలెంట్ షో!..

  • Published By: sekhar ,Published On : October 5, 2020 / 07:53 PM IST
వారికోసం ఉపాసన ఆన్‌లైన్ టాలెంట్ షో!..

Updated On : October 5, 2020 / 8:06 PM IST

Upasana Konidela: మెగా కోడలు ఉపాసన కొణిదెల మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆమె అక్కినేని కోడలు సమంతతో కలిసి ఎటువంటి పోషకాహారం తీసుకోవాలో చెబుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘మన ఊరు మన బాధ్యత’ అనే పేరుతో గ్రామాల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రపంచానికి తెలియజేసేందుకు భర్త రామ్‌ చరణ్‌తో కలిసి ఆమె సన్నద్ధమవుతున్నారు.

యువర్‌ లైప్‌ అనే ఆల్‌ ఇన్‌ వన్‌ ప్లాట్‌ఫాంను స్థాపించిన ఉపాసన.. దాని ద్వారా సాధ్యమైనంతగా సేవా కార్యక్రమాలు నిర్వహించేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఓ టాలెంట్‌ షోను ఆమె నిర్వహించనున్నారు. ఈ టాలెంట్‌ షో మానసికంగా, భౌతికంగా దివ్యాంగులైన వారి కోసం కావడం విశేషం.

వారిలో దాగి ఉన్న డ్యాన్స్ టాలెంట్‌ను ఈ షో ద్వారా ప్రోత్సహించాలని, తద్వారా వారిని ప్రపంచానికి పరిచయం చేయాలని ఉపాసన చేస్తున్న ఈ ప్రయత్నంలో మెగా పవర్‌స్టార్ రామ్‌ చరణ్‌తో పాటు స్టార్‌ కొరియోగ్రాఫర్లు ప్రభుదేవా, ఫరాఖాన్‌ కూడా భాగం అవుతున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా జరగనున్న ఈ షో కి సంబంధించిన వివరాలను తెలుపుతూ #healurlifethroughdance అనే హ్యాష్ ట్యాగ్ తో ఉపాసన ఓ పోస్టర్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.