Varun Tej : VT13ని శరవేగంగా పూర్తి చేస్తున్న వరుణ్.. టైటిల్ అనౌన్స్‌మెంట్.. పెళ్ళికి ముందే..!

గాండీవధారి అర్జున రిలీజ్ కి రెడీ చేస్తున్న వరుణ్.. VT13 ని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. వరుణ్ అండ్ లావణ్య పెళ్లి ఈ ఏడాది..

Varun Tej : VT13ని శరవేగంగా పూర్తి చేస్తున్న వరుణ్.. టైటిల్ అనౌన్స్‌మెంట్.. పెళ్ళికి ముందే..!

Varun Tej VT13 new schedule starts and title announcement news

Updated On : June 26, 2023 / 5:55 PM IST

Varun Tej – VT13 : మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవలే హీరోయిన్ ‘లావణ్య త్రిపాఠి’తో (Lavanya Tripathi) నిశ్చితార్ధం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ హీరో మళ్ళీ షూటింగ్స్ లో జాయిన్ అయ్యాడు. వరుణ్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. ఒక చిత్రాన్ని యాక్షన్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్నాడు. గాండీవధారి అర్జున (Gandeevadhari Arjuna) అనే టైటిల్ తో వస్తున్న ఈ మూవీ జేమ్స్ బాండ్ తరహాలో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ మూవీకి షూటింగ్ దాదాపు పూర్తి అయ్యినట్లు తెలుస్తుంది.

Upasana : డెలివ‌రీకి ముందు.. రామ్‌చ‌ర‌ణ్‌, ఉపాస‌న‌ల ఆనందాన్ని చూశారా..?

ఈ మూవీ రిలీజ్ డేట్ ని కూడా అనౌన్స్ చేసేశారు. ఆగష్టు 25న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ చిత్రంతో పాటు వరుణ్ VT13 సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. రియల్ ఇన్సిడెంట్స్ ని ఆధారంగా తీసుకోని కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో వరుణ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని జెట్ ఫైటర్ గా కనిపించబోతున్నాడు. రెనైసెన్స్ పిక్చర్స్ , సోని పిక్చర్స్ కలిసి ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ కొత్త షెడ్యూల్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. ఈ షెడ్యూల్ లో హై యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు. గాలిలో జరిగే ఈ యాక్షన్ సన్నివేశం అందర్నీ థ్రిల్ చేసేలా ఉండబోతుందట. అలాగే ఈ మూవీ టైటిల్ కూడా లాక్ అయ్యినట్లు, త్వరలోనే దానిని గ్రాండ్ గా అనౌన్స్ చేస్తామంటూ తెలియజేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ భామ మానుషి చిల్లర్ చేస్తుంది. కాగా వరుణ్ అండ్ లావణ్య పెళ్లి ఈ ఏడాది చివరిలో జరగనుంది. అంతకు ముందే ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తి చేయాలనీ చూస్తున్నట్లు తెలుస్తుంది.