Sankranthiki Vasthunam : రేపే వెంకీమామ ‘సంక్రాంతికి వస్తున్నాం’ రిలీజ్.. హిట్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా?
సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది.

Venkatesh Sankranthiki Vasthunam Movie Theatrical Business Details
Sankranthiki Vasthunam : దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రేపు జనవరి 14న సంక్రాంతి పండగ నాడు రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించగా vtv గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read : హీరో నిఖిల్ సిద్దార్థ కొడుకు భోగిపళ్ళు సెలబ్రేషన్స్.. వీడియో చూశారా?
సినిమాలో గోదారి గట్టు సాంగ్ ని రమణ గోగులతో పాడించి సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచారు. ఈ సాంగ్ పెద్ద హిట్ అయి అందరి ఇళ్లకు చేరింది. ఆ తర్వాత వచ్చిన పాటలు కూడా మంచి హిట్స్ అయ్యాయి. పాటలతోనే కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది ఈ సినిమాకు. ఇక మూవీ యూనిట్ ప్రమోషన్స్ కూడా కొత్తగా చేసారు. వెంకటేష్, హీరోయిన్స్ సైతం రీల్స్ చేసి సోషల్ మీడియాలో హడావిడి చేయడంతో ఈ సినిమాపై అందరికి ఆసక్తి నెలకొంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు వచ్చిన క్రేజ్ చూసి థియేట్రికల్ బిజినెస్ కూడా బాగా జరిగింది. టాలీవుడ్ సమాచారం ప్రకారం సంక్రాంతికి వస్తున్నాం సినిమా నైజాంలో 10 కోట్లకు, సీడెడ్ 7 కోట్లకు, ఆంద్ర 15 కోట్లకు, రెస్టాఫ్ ఇండియా 4 కోట్లకు, ఓవర్సీస్ 5 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. దీంతో వరల్డ్ వైడ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా సుమారు 41 కోట్ల థియేటరికల్ బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కనీసం 45 కోట్ల షేర్ అంటే ఆల్మోస్ట్ 90 కోట్ల గ్రాస్ రాబట్టాలి.
Also Read : Varun Sandesh Family Photos : వరుణ్ సందేశ్, వితిక షేరు ఫ్యామిలీ ఫొటోలు చూశారా..? సంక్రాంతి సెలబ్రేషన్స్..
సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి ఉన్న క్రేజ్ చూస్తుంటే ఈజీగా 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి సూపర్ హిట్ సినిమాగా నిలవనుంది. ఇప్పటివరకు వెంకీమామకు 100 కోట్ల సినిమా లేదు. ఈ సినిమాతో ఆ రికార్డ్ కూడా కొట్టేస్తాడు అని భావిస్తున్నారు ఫ్యాన్స్. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ క్రైమ్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది. ఒక మాజీ గర్ల్ ఫ్రెండ్, భార్య మధ్యలో నలిగే మాజీ పోలీసాఫీసర్ పాత్రలో వెంకటేష్ అదరగొట్టబోతున్నాడు.