వెంకీ మామ ట్రాక్టర్ ర్యాలీ చూశారా!

తెలుగు రాష్ట్రాల్లోని వెంకీ, చైతు అభిమానులు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు..

  • Published By: sekhar ,Published On : December 10, 2019 / 11:04 AM IST
వెంకీ మామ ట్రాక్టర్ ర్యాలీ చూశారా!

Updated On : December 10, 2019 / 11:04 AM IST

తెలుగు రాష్ట్రాల్లోని వెంకీ, చైతు అభిమానులు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు..

రియల్ లైఫ్ మామా అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, యువసామ్రాట్ నాగ చైతన్య రీల్ లైఫ్ మామా అల్లుళ్లుగా నటించిన సినిమా.. ‘వెంకీ మామ’.. వెంకీతో పాయల్ రాజ్‌పుత్, చైతుతో రాశీఖన్నా జతకట్టగా.. బాబీ దర్శకత్వంలో, సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ‘వెంకీ మామ’ సెన్సార్ పనులు పూర్తయ్యాయి.

మరోవైపు అక్కినేని, దగ్గుబాటి ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ చేసేశారు. ఇప్పటికే థియేటర్ల దగ్గర భారీ కటౌట్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోని వెంకీ, చైతు అభిమానులు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

ట్రాక్టర్లపై వెంకీ, చైతు కటౌట్స్ పెట్టి, వాటి ముందు డప్పులు కొడుతూ చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ చూపరులను ఆకట్టుకుంది. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకుని డిసెంబర్ 13న భారీగా విడుదల కానుంది ‘వెంకీ మామ’.