బాలు ఆరోగ్యంపై ఉప రాష్ట్రపతి ఆరా..
SPB Health Condition- M. Venkaiah Naidu: కరోనా బారినపడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తతో సినీ వర్గాల వారు, బాలు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.
తాజాగా బాలు ఆరోగ్య పరిస్థితి గురించి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వాకబు చేశారు. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఎంజీఎం వైద్యులతో మాట్లాడారు. బాలు ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన వెంకయ్య నాయుడు అవసరమైతే ఇతర వైద్య నిపుణులను కూడా సంప్రదించాలని వారికి సూచించారు.
కాగా బాలు ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి విశ్వనటుడు కమల్ హాసన్ ఎంజీఎం హాస్పిటల్కు వెళ్లారు. బాలు పరిస్థితి గురించి వైద్యులు మరియు బాలు తనయుడు ఎస్పీ చరణ్ తో కమల్ మాట్లాడారు. బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన త్వరగా కోలుకోవాలని కమల్ ఆకాంక్షించారు.