Vijay Devarakonda: బెదురులంక టీజర్‌ను వదులుతున్న రౌడీ స్టార్..!
టాలీవుడ్‌లో ‘ఆర్ఎక్స్ 100’ మూవీతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ. ఆ తరువాత ఈ హీరో నటించిన ప్రతి సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అదిరిపోయే బజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఆయన నటించిన ఏ సినిమా కూడా ఆర్ఎక్స్ 100 తరహా హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఈ హీరో పలు ప్రయోగాత్మక పాత్రలతో పాటు విలన్ రోల్ కూడా చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.

Vijay Devarakonda To Release Karthikeya Bedurulanka 2012 Teaser
Vijay Devarakonda: టాలీవుడ్‌లో ‘ఆర్ఎక్స్ 100’ మూవీతో అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో కార్తికేయ. ఆ తరువాత ఈ హీరో నటించిన ప్రతి సినిమాపై కూడా ప్రేక్షకుల్లో అదిరిపోయే బజ్ క్రియేట్ అయ్యింది. అయితే ఆయన నటించిన ఏ సినిమా కూడా ఆర్ఎక్స్ 100 తరహా హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఈ హీరో పలు ప్రయోగాత్మక పాత్రలతో పాటు విలన్ రోల్ కూడా చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తాజాగా కార్తికేయ నటిస్తున్న ‘బెదురులంక 2012’ అనే సినిమా ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది.
Bedurulanka 2012: బెదురులంక 2012 గ్లింప్స్.. ఈసారి కార్తికేయ హిట్టు కొట్టేలా ఉన్నాడుగా!
ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక తాజాగా ఈ సినిమా నుండి టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ‘బెదురులంక 2012’ చిత్ర టీజర్‌ను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేతులు మీదుగా రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ టీజర్‌ను ఇవాళ సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.
Bedurulanka 2012: బెదురులంక 2012 ఫస్ట్ లుక్.. ఇది అప్పుడు రావాల్సిన సినిమానా..?
ఇక ఈ సినిమాలో కార్తికేయ పాత్ర, పర్ఫార్మెన్స్ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తోండగా, క్లాక్స్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తుండగా, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.
A tiny look into #Bedurulanka2012 ? before introducing you to the biggest hoax ever ?#Bedurulanka2012Teaser LAUNCH EVENT TODAY, 5 PM
?RK Cineplex@ActorKartikeya @iamnehashetty #Clax @Benny_Muppaneni #ManiSharma @Loukyaoffl @SonyMusicSouth @Ticket_Factory @PulagamOfficial pic.twitter.com/Bc3RPh3A7P
— Loukya entertainments (@Loukyaoffl) February 10, 2023