Vijay Deverakonda: విజయ్ టీషర్ట్ అదిరింది.. రేటెంతో తెలుసా?

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ‘జీరో టాలరెన్స్ గ్యాంగ్‌స్టర్ స్వెట్ టీషర్ట్‌లో క్యూట్‌గా కనిపించాడు..

Vijay Deverakonda: విజయ్ టీషర్ట్ అదిరింది.. రేటెంతో తెలుసా?

Vijay Deverakonda

Updated On : October 21, 2021 / 12:12 PM IST

Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఏం చేసినా, పబ్లిక్‌లో కానీ సినిమా ఫంక్షన్స్‌లో ఎలా కనబడినా సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉంటుంది. ‘పెళ్లి చూపులు’, ‘గీత గోవిందం’, ‘అర్జున్ రెడ్డి’ తో మనోడి క్రేజ్ కొండెక్కి కూర్చుంది. రౌడీ పేరుతో ఫ్యాషన్ ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చి యూత్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు.

Vijay Deverakonda Family : శ్రీవారి సన్నిధిలో దేవరకొండ ఫ్యామిలీ

ఇటీవల ఏషియన్ సినిమాస్‌తో కలిసి మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి కూడా అడుగు పెట్టాడు. ‘అర్జున్ రెడ్డి’ తో విజయ్‌కి బాలీవుడ్‌లో కూడా మాంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ‘లైగర్’ చేస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఇంపార్టెంట్ రోల్ చేస్తుండడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.

Vijay Deverakonda Mother : అమ్మకు ప్రేమతో అదిరిపోయే గిఫ్ట్..

బుధవారం రాత్రి జరిగిన ‘రౌడీ బాయ్స్’ సినిమా సెకండ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చినప్పుడు రౌడీ స్టార్ వేసుకున్న టీషర్ట్ గురించి ఇప్పుడు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. విజయ్ ‘జీరో టాలరెన్స్ గ్యాంగ్‌స్టర్ స్వెట్ టీషర్ట్‌లో క్యూట్‌గా కనిపించాడు. ఇండియాలో దీని రేటు రూ. 10, 500 లు. కాస్ట్ సంగతి పక్కన పెడితే.. రౌడీ స్టార్ ఎప్పటికప్పుడు కొత్త స్టైల్స్‌లో కనిపిస్తే.. యూత్ ఆయన స్టైల్‌ని ఫాలో అయిపోతుంటారు.

Zero Tolerance Gangster Sweatshirt