Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఎమోషన్ ట్వీట్.. ‘అది నా పిల్ల’..!

అది నా పిల్లరా అంటున్న విజయ్ దేవరకొండ. వైరల్ అవుతున్న ఎమోషన్ పోస్ట్.

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ ఎమోషన్ ట్వీట్.. ‘అది నా పిల్ల’..!

Vijay Deverakonda shares adhi naa pilla ra meme video gone viral

Updated On : August 27, 2023 / 3:08 PM IST

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం ‘ఖుషి’ (Kushi) రిలీజ్ కి సిద్ధం అవుతుంది. శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సమంత (Samantha) హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ ట్రైలర్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇది ఇలా ఉంటే, ట్రైలర్ లోని కొన్ని సీన్స్ పై మీమర్స్ మీమ్స్ చేస్తూ నెటిజెన్స్ ని అలరిస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల ఒక మీమ్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ మీమ్ వీడియో ఏంటో మీరు కూడా చూసేయండి.

Allu Arjun : నా భార్యకు సినిమాల గురించి తెలియదు.. నేషనల్ అవార్డు వచ్చాక స్నేహ ఎలా స్పందించింది?

ఇలా విజయ్ ఖుషి సినిమాలో చెప్పిన డైలాగ్ ని, బేబీ మూవీలో ఆనంద్ దేవరకొండ చెప్పిన డైలాగ్ ని జత చేస్తూ చేసిన మీమ్ నెటిజెన్స్ విపరీతంగా నవ్విస్తుంది. దీంతో ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అయ్యి విజయ్ దేవరకొండ వరకు చేరుకుంది. ఇక ఇది చూసిన విజయ్ కూడా బాగా ఎంజాయ్ చేసినట్లు ఉన్నాడు. అందుకనే ఆ మీమ్ వీడియోని రీ ట్వీట్ చేస్తూ.. ‘అది నా పిల్ల’ అనేది ఒక ఎమోషన్ అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ చూసిన రౌడీ అభిమానులు హాస్యం వ్యక్తం చేస్తున్నారు.

Allu Arjun : జాతీయ ఉత్తమ నటుడు అవార్డుపై మొదటిసారి స్పందించిన అల్లు అర్జున్.. చాలా విభాగాల్లో పుష్ప నామినేషన్లు.. కానీ..

ఇక ఖుషి విషయానికి వస్తే.. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఖుషి వంటి కల్ట్ టైటిల్, ప్రేమ కథల సెప్షలిస్టు శివ నిర్వాణ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండడంతో ఆడియన్స్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి విజయ్ కి ‘లైగర్’తో మిస్ అయిన పాన్ ఇండియా హిట్ ని ఖుషి అందిస్తుందా? లేదా? చూడాలి.