Vijay Devarakonda : కేరళలో రోడ్ మీద జాగింగ్ చేస్తుంటే.. విజయ్ దేవరకొండని ఆపి మరీ..

తాజాగా విజయ్ దేవరకొండ కేరళ నుంచి పలు వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

Vijay Devarakonda : కేరళలో రోడ్ మీద జాగింగ్ చేస్తుంటే.. విజయ్ దేవరకొండని ఆపి మరీ..

Vijaya Deverakonda Shares Videos from Kerala goes Viral

Updated On : October 11, 2024 / 3:10 PM IST

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 సినిమా షూట్ తో బిజీగా ఉన్నాడు. ఇటీవలే శ్రీలంకలో షూటింగ్ ముగించుకున్న విజయ్ దేవరకొండ సినిమా ప్రస్తుతం కేరళలో షూటింగ్ చేస్తున్నాడని సమాచారం. అయితే తాజాగా విజయ్ దేవరకొండ కేరళ నుంచి పలు వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు.

విజయ్ దేవరకొండ.. కేరళలో టీ తోటల మధ్య ఉదయాన్నే జాగింగ్ చేస్తున్న వీడియోలు, అలా జాగింగ్ చేస్తుంటే మధ్యలో కొంతమంది ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చి విజయ్ దేవరకొండతో ఫోటోలు దిగడం, కొండ అంచున నిలబడి సేద తీరడం లాంటి వీడియోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు. అలాగే తాను జాగింగ్ చేసిన రూట్ మ్యాప్, అప్పుడు తన హార్ట్ బీట్.. లాంటి డీటెయిల్స్ కూడా షేర్ చేయడం గమనార్హం.

Also Read : RGV – Fahadh Faasil : ఆర్జీవీతో ఫహద్ ఫాజిల్.. వీళ్లిద్దరు ఎందుకు కలిసారో.. ఏం ప్లాన్ చేస్తున్నారో..

దీంతో విజయ్ దేవరకొండ షేర్ చేసిన వీడియోలు వైరల్ గా మారాయి. కేరళలో కూడా విజయ్ ని బాగానే గుర్తుపట్టి ఫోటోలు తీసుకుంటున్నారు అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక విజయ్ చేతిలో నెక్స్ట్ మూడు భారీ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. అందులో గౌతమ్ తిన్ననూరి సినిమా కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.