విక్రమ్‌గా కమల్ హాసన్.. టీజర్ అదిరింది..

  • Published By: vamsi ,Published On : November 7, 2020 / 06:57 PM IST
విక్రమ్‌గా కమల్ హాసన్.. టీజర్ అదిరింది..

Updated On : November 7, 2020 / 9:04 PM IST

రాజకీయాల్లో పూర్తిస్థాయిలో యాక్టివ్ అవుతున్నట్లుగా ప్రకటించిన నటుడు కమల్ హాసన్.. లేటెస్ట్‌గా తన సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌ను విడుదల చేశారు. తన పుట్టినరోజు నాడు అభిమానులను అలరిస్తూ.. కమల్.. తన 232వ సినిమా టైటిల్‌ టీజర్‌ను విడుదల చేశారు. లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకి అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు.



కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాకి ‘విక్రమ్‌’ అనే టైటిల్‌ ఖరారు చెయ్యగా.. కమల్‌ మాస్‌ క్యారెక్టర్‌లో అదరగొట్టారు. భోజనం వడ్డించిన అరటి ఆకుల్లో.. పంచెకట్టులో తమిళ రాజకీయాలకు సంబంధించిన సినిమాలా ఇది అనిపిస్తుంది. ప్రస్తుతం కమల్‌ హాసన్ ఈ సినిమాతో పాటు ‘భారతీయుడు 2’కు కూడా సంతకం చేశాడు.



శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ కొన్నాళ్లు జరగగా.. లాక్‌డౌన్ కారణంగా ఆగిపోయింది. కాజల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, సిద్ధార్థ్‌ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవంబరు చివర్లో తిరిగి షూటింగ్‌ మొదలు కానున్నట్లుగా తెలుస్తుంది.