Vindu Bhojanam : ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న ‘విందు భోజనం’ చూశారా?

ఇటీవల ఆహా ఓటీటీలో విందు భోజనం అనే సినిమా వచ్చింది.

Vindu Bhojanam : ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న ‘విందు భోజనం’ చూశారా?

Vindu Bhojanam New Movie Streaming in Telugu OTT Aha

Updated On : July 11, 2024 / 7:33 AM IST

Vindu Bhojanam : మన తెలుగు ఓటీటీ ఆహాలో ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆహా ఓటీటీలో విందు భోజనం అనే సినిమా వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఆహాలో మంచి వ్యూయర్ షిప్ తెచ్చుకుంటుంది. యారో సినిమాస్ బ్యానర్ పై బూజం జగన్ మోహన్ రెడ్డి నిర్మాణంలో కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విందు భోజనం.

విందు భోజనం సినిమాలో చాలా వరకు కొత్త నటీనటులు నటించారు. కొంతమంది తెలిసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా నటించారు. అఖిల్ రాజ్, ఐశ్వర్య జంటగా సిద్దార్థ్ గొల్లపూడి, హర్షవర్ధన్, అనిత చౌదరి, కేశవ్ దీపక్, ఆశ్రిత వేముగంటి.. ఇలా పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

Also Read : Mahesh Babu – Rajamouli : మహేష్ – రాజమౌళి సినిమాకు ఆషాఢం అడ్డొచ్చిందా?

చిన్నప్పట్నుంచి చెఫ్ అవుదామనుకొని పెద్దయ్యాక ఓ రెస్టారెంట్ లో చెఫ్ అవుతాడు హీరో, అతని చెఫ్ కల, అతని లవ్ స్టోరీ, రెస్టారెంట్ గొడవలు, తండ్రి ఎమోషన్.. ఇలా ఆసక్తికరంగా విందు భోజనం సినిమాని తెరకెక్కించారు. ప్రస్తుతం విందు భోజనం సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది.