Vishwambhara : చిరంజీవి ‘విశ్వంభర’ నుంచి ఫస్ట్ సాంగ్ అప్‌డేట్.. ‘రామరామ’ పాట ఎప్పుడంటే..?
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ విశ్వంభర

Vishwambhara First Single RamaRaama Update
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ విశ్వంభర. ‘బింబిసారా’ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సోషియో ఫాంటసీ జానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో త్రిషతో పాటు కునాల్ కపూర్, ఆషికా రంగనాథ్, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ మొత్తం ఐదుగురు కథానాయికలుగా నటిస్తున్నారు.
Ram Charan : కమెడియన్ సత్య కాళ్ళు మొక్కిన రామ్ చరణ్.. సత్య చరణ్ ఇంటికి వెళ్లడంతో.. వీడియో వైరల్..
తాజాగా ఈ చిత్రం నుంచి అప్‌డేట్ వచ్చేసింది. ఈ చిత్రంలో తొలి పాటను ఎప్పుడు విడుదల చేయనున్నారు అన్న సంగతిని చెప్పేశారు. రామరామ అంటూ సాగే ఈ పాటను ఏప్రిల్ 12న శనివారం విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
A Hanuman’s love and reverence for his Lord Shri Ram 🏹✨#Vishwambhara First Single #RamaRaama out on April 12th ❤️🔥
Music by the Legendary @mmkeeravaani 🛐
Lyrics by ‘Saraswatiputra’ @ramjowrites ✒️MEGA MASS BEYOND UNIVERSE.
MEGASTAR @KChiruTweets @trishtrashers… pic.twitter.com/obH0onoxhN
— UV Creations (@UV_Creations) April 10, 2025
ఈ పోస్టర్‌లో ఆంజనేయుడి గెటప్ చాలా మంది చిన్నారులు నిలుచొని ఉండగా.. మధ్యలో చిరంజీవి ఓ చిన్నారిని భుజంపైకి ఎక్కించుకుని కనిపించాడు. చిరు వెనుక శ్రీరాముడి విగ్రహం ఉంది. మొత్తంగా ఈ పోస్టర్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. సాంగ్ కోసం వెయిటింగ్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.