Rathika Rose Re Entry : బిగ్‌బాస్ హౌస్‌లోకి రతిక రీ ఎంట్రీ..? నిజమెంతా..?
బిగ్‌బాస్ సీజన్ 7లో విజయవంతంగా నాలుగు వారాలు ముగిశాయి. ప్రస్తుతం ఐదో వారం కొనసాగుతోంది.

Rathika Rose
Rathika Rose : బిగ్‌బాస్ సీజన్ 7లో విజయవంతంగా నాలుగు వారాలు ముగిశాయి. ప్రస్తుతం ఐదో వారం కొనసాగుతోంది. నాలుగు వారాల్లో నలుగురు కిరణ్ రాథోడ్, షకిలా, దామిని, రతికలు ఎమిలినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో 10 మంది కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. వరుసగా నలుగురు మహిళా కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడం తెలుగు బిగ్‌బాస్ చరిత్రలో ఇదే మొదటి సారి. వీరిలో రతిక రోజ్ ఎలిమినేషన్ చాలా మందికి షాకింగ్ గురి చేసింది.
సీజన్ ఆరంభంలో ఆమె టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరిగా ఉంటుందని చాలా మంది భావించారు. కాగా.. నాలుగో వారానికి ఆమె ఎలిమినేట్ కావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌తో ఆమె వ్యవహరించిన తీరు విమర్శల పాలు కావడంతో ఆమెకు ప్రేక్షకులు ఓట్లు వేయనట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. బిగ్‌బాస్ హౌస్‌లోకి రతిక రీ ఎంట్రీ ఇస్తుందనే టాక్ నడుస్తోంది.
LEO Official Trailer: లియో ట్రైలర్ విడుదల.. విజయ్ యాక్షన్ సీన్స్ మామూలుగా లేవు
ఈ సీజన్ ఉల్టా ఫల్టాగా ఉంటుందని సీజన్ ఆరంభంలోనే చెప్పేశారు. ఈ క్రమంలో వచ్చే వారంలో వైల్డ్ కార్డు ద్వారా మరో ఆరు లేదా ఏడుగురు కంటెస్టెంటర్లను హౌస్‌లోకి పంపించనున్నారట. ఇది మినీ లాంచింగ్ ఈవెంట్ లాంటిదేనని అంటున్నారు. అక్టోబర్ 8 ఆదివారం ఈ లాంచింగ్ ఎపిసోడ్ ఉంటుందని చెబుతున్నారు. వీరిలో రతిక కూడా ఉంటుందని అంటున్నారు. బిగ్‌బాస్ రెండవ సీజన్‌లో నూతన్ నాయుడు రీ ఎంట్రీ ఇచ్చినట్లుగా ఈ సారి రతికను కూడా హౌస్‌లోపలికి పంపాలని ఆమె ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరీ రతిక రీ ఎంట్రీ ఇస్తుందో లేదో మరో మూడు నాలుగు రోజుల్లో తేలిపోనుంది.