Yash : రామాయణం మొదలుపెట్టిన యశ్.. షూటింగ్ సెట్ నుంచి ఫొటోలు రిలీజ్.. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ తో..
ఈ సినిమాలో యశ్ రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

Yash Started Ramayanam Shoot Shooting Stills Released
Yash : బాలీవుడ్ లో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాముళ్లుగా రామాయణం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. నమిత్ మల్హోత్రా, యశ్ నిర్మాణంలో నితేష్ తివారీ దర్శకత్వంలో రామాయణం రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో యశ్ రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నాడు.
తాజాగా యశ్ రామాయణం సినిమా కోసం హాలీవుడ్‌కు చెందిన ప్రఖ్యాత స్టంట్ డైరెక్టర్ గై నోరిస్‌తో కలిసి యాక్షన్ సన్నివేశాలపై పని చేస్తున్నారు. గై నోరిస్ గతంలో మాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్, ది సుసైడ్ స్క్వాడ్ లాంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాలకు స్టంట్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఆయన రామాయణం కోసం ప్రత్యేకంగా భారతదేశానికి వచ్చి యాక్షన్ సన్నివేశాలు డైరెక్ట్ చేస్తున్నారు.
Also Read : Sarkaar : ‘సర్కార్’ మళ్ళీ వచ్చేస్తున్నాడు.. మరోసారి సుడిగాలి సుధీర్ ఎంటర్టైన్మెంట్..
ఈ రామాయణం సినిమాలో యశ్ రావణాసురుడిగా నటించడమే కాక సహా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. తాజాగా షూటింగ్ సెట్స్ లో యశ్, గై నోరిస్ యాక్షన్ సీన్స్ ని చర్చిస్తున్న ఫోటోలను రిలీజ్ చేసారు. ఇక ‘రామాయణం – పార్ట్ 1’ దీపావళి 2026లో విడుదల చేయనుండగా, రెండవ భాగం దీపావళి 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : Pawan Kalyan : రోజంతా షూట్ చేసి.. రాత్రికి నాలుగు గంటల్లో మొత్తం పని పూర్తిచేసిన పవన్.. అభినందించాల్సిందే..