YVS Chowdary : కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌‌కు కృతజ్ఞతలు

వైవీఎస్‌ చౌదరి మాట్లాడుతూ... ''విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాకు ఎన్టీఆర్‌ జిల్లాగా పేరు పెట్టాలన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. తెలుగు......

YVS Chowdary : కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌‌కు కృతజ్ఞతలు

Ys Jagan

Updated On : January 29, 2022 / 9:53 AM IST

YVS Chowdary :   ఇటీవల ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంద్రప్రదేశ్ లోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విడదీస్తూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. ఈ కొత్త జిల్లాలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా పలువురు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇక కొత్త జిల్లాలకు పెట్టిన పేర్లను కూడా ప్రస్తావిస్తున్నారు. తాజాగా సినీ నిర్మాత, దర్శకుడు వైవీఎస్‌ చౌదరి ఏపీ కొత్త జిల్లాల ప్రకటనపై మీడియాతో మాట్లాడారు.

Vijay : ఎన్నికలకి సిద్ధం అంటున్న విజయ్.. పార్టీ తరపున పోటీ చేయమని అభిమానులకి పిలుపు..

వైవీఎస్‌ చౌదరి మాట్లాడుతూ… ”విజయవాడ కేంద్రంగా కొత్తగా ఏర్పడబోతున్న జిల్లాకు ఎన్టీఆర్‌ జిల్లాగా పేరు పెట్టాలన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. తెలుగు ప్రజల అభిమతం, అకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు. సీఎం జగన్‌ పంథాలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలోనే ఓ జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టాలని కోరుతున్నాను. అలాగే ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’అవార్డు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను” అని తెలిపారు.