Satyadev vs Brahmaji : సత్యదేవ్ వర్సెస్ బ్రహ్మాజీ.. ఒకరిపై ఒకరు కౌంటర్లు.. ఇంటర్వ్యూ ప్రొమో చూశారా?
సత్యదేవ్ నటిస్తున్న మూవీ జీబ్రా.

Zebra movie promotions Satyadev vs Brahmaji
Satyadev vs Brahmaji : సత్యదేవ్ నటిస్తున్న మూవీ జీబ్రా. లక్ ఫేవర్స్ ది బ్రేవ్.. అన్నది ఉపశీర్షిక. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిలిమ్స్ బ్యానర్స్ పై SN రెడ్డి, పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నడ స్టార్ డాలి ధనుంజయ, సత్యరాజ్, ప్రియా భవాని శంకర్, సత్య, సునీల్, జెన్నిఫర్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. ఇక విడుదల తేదీ దగ్గర పడడంతో చిత్ర బృందం ప్రమోషల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. ఇక హీరో సత్యదేవ్‌ను సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఇంటర్య్వూ చేశాడు.
NTR : ఎన్టీఆర్ కోసం కుప్పం నుండి కాలినడక వచ్చిన ఫ్యాన్స్.. ఎన్టీఆర్ చూసి ఏం చేసాడంటే..
ఈ ఇంటర్వ్యూ ప్రొమోలో.. వస్తూ వస్తూనే బ్రహ్మాజీ.. ఈ న్యూసెన్స్ ఏంటి, గోల ఏంటి, అమ్మాయిలు ఏంటీ అని సత్యదేవ్‌ను అడిగారు. నువ్వు డ్యాన్స్ చేశావా అని అడుగగా.. ఏదో హుక్ స్టెప్ వేశాను అని సత్యదేవ్ చెప్పాడు. సినిమా గురించి చెప్పాలిగా ఎవరికి తెలియదు అని బ్రహ్మాజీ అన్నారు. చెప్పనీయకుండా ఎక్కేస్తున్నవ్ అని సత్యదేవ్ అన్నాడు.
ఓ సందర్భంలో నీలాగా నేను పోస్టులు పెట్టి డిలీట్ చేయను అంటూ సత్యదేవ్ అన్నాడు. మొత్తంగా ఒకరికొకరు కౌంటర్లు వేస్తున్నట్లుగా తెలుసుకుంది. ప్రొమో వైరల్ అవుతేనే ఫుల్ ఇంటర్వ్యూను విడుదల చేస్తామని సత్యదేవ్ ఈ ఇంటర్వ్యూ ప్రొమోను పోస్ట్ చేశాడు.
Pushpa 3 : అమ్మో పుష్ప 3 నేను చేయలేను.. బాలయ్య షోలో పుష్ప 3 పై అల్లు అర్జున్ కామెంట్స్..
Brutal Brahmaji with the #zebra !!
Promo baaga reach ayithe full video release chestham 😁😁#zebra on #nov22 pic.twitter.com/G2ooJRFGXU
— Satya Dev (@ActorSatyaDev) November 15, 2024