Govt tells Supreme Court: 10-17 మధ్య వయసున్న 1.58 కోట్ల మంది మత్తు పదార్థాలకు అలవాటు

Govt tells Supreme Court: 10-17 మధ్య వయసున్న 1.58 కోట్ల మంది మత్తు పదార్థాలకు అలవాటు

Govt tells Supreme Court

Updated On : December 15, 2022 / 11:28 AM IST

Govt tells Supreme Court: దేశంలో 10-17 మధ్య వయసున్న 1.58 కోట్ల మంది మత్తు పదార్థాలకు అలవాటుపడ్డారని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వారిలో మద్యానికి బానిసైన వారు అధికంగా ఉన్నారని, ఆ తర్వాత గంజాయికి ఎక్కువగా బానిసలయ్యారని చెప్పింది. ఓ సర్వేలో తేలిన విషయాలను తాజాగా సుప్రీంకోర్టుకు కేంద్రం వివరించింది.

దేశంలో 16 కోట్ల మందికి మద్యం తాగే అలవాటు ఉందని, 5.7 కోట్ల మంది దాని వల్ల తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పింది. 3.1 కోట్ల మంది ప్రజలు గంజాయి ఉత్పత్తులు వాడుతున్నారని వివరించింది. మత్తుపదార్థాల వినియోగంపై 2016లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఓ తీర్పు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మొదటి దశలో సర్వే నిర్వహించామని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి చెప్పారు.

కాగా, దేశ జనాభాలో 14.6 శాతం మంది ప్రజలు మద్యం తాగుతున్నారని కేంద్ర సర్కారు చెప్పింది. పురుషుల్లో 27.3 శాతం మంది, మహిళల్లో 1.6 శాతం మంది మద్యం తాగుతున్నారని పేర్కొంది. మద్యం అధికంగా వాడుతున్న రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, త్రిపుర, పంజాబ్, అరుణాచల్ ప్రదేశ్, గోవా మొదటి స్థానాల్లో ఉన్నాయని చెప్పింది. దేశ జనాభాలో 2.8 కోట్ల మంది గంజాయి వాడుతున్నారని పేర్కొంది. గంజాయి ఎక్కువగా యూపీ, పంజాబ్, సిక్కిం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీలో వాడుతున్నారని చెప్పింది.

Lionel Messi : లియోనల్ మెస్సీ వరల్డ్ గ్రేటెస్ట్ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా ఎదిగిన వెనుకున్న కారణాలు..