Explode : జమ్మూ కాశ్మీర్‌లో పేలుడు.. ఒకరి మృతి
అటవీ ప్రాంతంలో మోర్టార్ షెల్ పేలడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

Mortal Shell Explode
Jammu and Kashmir Explode : జమ్మూ కాశ్మీర్‌లో మోర్టల్ షెల్ పేలడంతో ఒకరు మృతి చెందారు. సాంబా జిల్లా చాంద్లీ గ్రామంలో శుక్రవారం అటవీ ప్రాంతంలో దొరికిన మోర్టార్ షెల్ పేలడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ మేరకు సాంబ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మీడియాకు వివరాలు వెల్లడించారు. చాంద్లీ గ్రామంలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగిందన్నారు.
అటవీ ప్రాంతంలో మోర్టార్ షెల్ పేలడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. అతన్ని జమ్మూ జీఎంసీకి తరలించినట్లు సాంబ ఎస్ఎస్ పీ బెనమ్ తోష్ తెలిపారు.
Covid cases : పలు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు