పుల్వామాలో ఉగ్రదాడి…12మంది పౌరులకు గాయాలు

  • Published By: venkaiahnaidu ,Published On : November 18, 2020 / 08:38 PM IST
పుల్వామాలో ఉగ్రదాడి…12మంది పౌరులకు గాయాలు

Updated On : November 18, 2020 / 8:47 PM IST

grenade attack by terrorists in Pulwama జమ్మూకశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో బుధవారం(నవంబర్-18,2020)భద్రతా దళాలపై ఉగ్రవాదులు జరిపిన గ్రనేడ్ దాడిలో 12మంది పౌరులు గాయాలపాలయ్యారు. పుల్వామాలోని కాకపోరా చౌక్ వద్ద గుర్తుతెలియని ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరిన ఘటనలో 12మంది పౌరులు గాయపడ్డారని భద్రతా అధికారులు తెలిపారు. గాయపడిన పౌరులను దగ్గర్లోని హాస్పిటల్ కి తరలించినట్లు చెప్పారు.



అయితే, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని వారు గ్రనేడ్ విసరగా అది టార్గెట్ ని మిస్ అయ్యి రోడ్డుపై పేలిందని తెలిపారు. ఈ ఘటనలో ఏ ఒక్క సీఆర్పీఎఫ్ జవాన్ గాయపడలేదని తెలిపారు. ఘటనాస్థలాన్ని కార్డర్ ఆఫ్ చేసి దాడికి పాల్పడినవాళ్లను పట్టుకునేందుకు సెర్చ్ కొనసాగుతున్నట్లు ఓ అధికారి తెలిపారు.