తెల్లవారుజామున కర్ణాటక రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి, వేగంగా వస్తున్న ఎస్‌యువి కారును ఢీకొట్టింది

కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు-మంగళూరు జాతీయ రహదారిలో బైలాదకరే గ్రామంలో శుక్రవారం (మార్చి 6, 2020) తెల్లవారుఝామున 3 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడాది వయస్సున్న బాలుడుతో సహా 12 మంది మరణించారు. హాస్పటిల్‌లో మరో అబ్బాయి చనిపోయాడు. అతివేగమే ప్రమాదానికి కారణంగా అధికారులు చెబుతున్నారు. కార్లు ఒకదానితో ఒకటి ఢీకొనగా ఈ ప్రమాదం జరిగింది.
నలుగురు ప్రయాణికులు బ్రెజ్జా కారు ధర్మస్థలానికి వెళుతుండగా, హోసూర్ మీదుగా బెంగళూరు వైపు వెళుతున్న తవేరా కారును ఢీ కొట్టింది. తవేరాలోని ప్రయాణికులు తమిళనాడు నివాసితులు. కర్ణాటకలోని తుమ్కూర్ జిల్లాలోని కునిగల్ తాలూకాలోని బైలాదకరే గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.
మరణించిన వారిలో పది మంది తమిళనాడుకు చెందినవారు కాగా, మరో ఇద్దరు బెంగళూరుకు చెందినవారు. చనిపోయినవారిలో అయిదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
Karnataka: At least 12 people lost their lives after two cars collided in Tumkur at around 3 am today. pic.twitter.com/GWe5mz08rm
— ANI (@ANI) March 6, 2020