ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు, ట్రక్కు ఢీ.. 14మంది మృతి

  • Published By: veegamteam ,Published On : November 18, 2019 / 04:56 AM IST
ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు, ట్రక్కు ఢీ.. 14మంది మృతి

Updated On : November 18, 2019 / 4:56 AM IST

రాజస్థాన్‌లో సోమవారం (నవంబర్ 18, 2019) ఉదయం 7: 45 నిమిషాలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు, ట్రక్కు ఢీకొనడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బికనేర్‌ జిల్లా శ్రీదంగర్‌గఢ్‌ సమీపంలోని 11వ నెంబర్‌ జాతీయరహదారిపై చోటుచేసుకుంది.

ఈ ప్రమాదం గురించి తెలుసిన స్థానికులు ఘటనా స్థలికి చేరుకుని పోలీసులకు విషాన్ని తెలిపారు. అనంతరం పోలిసులు ఘటన స్థలానికి చేరుకుని
మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. గాయపడిన వారిని చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఘటనా స్థలంలోనే 10 మంది ప్రాణాలు కోల్పోగా, హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ నలుగురు మృతిచెందారు.

బస్సు బికనేర్ నుండి జైపూర్ వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ట్రక్ బస్సును వేగంగా వచ్చి ఢీకొంది. పొగమంచు, అతివేగమే ఇందుకు కారణం అని పోలిసు అధికారులు తెలిపారు. ప్రమాద స్థలంలో ఉన్న గులాబ్ నబీ ఖాన్ మాట్లాడుతూ..క్రేన్లు ఉపయోగిస్తూ.. బోల్తాపడిన రెండు వాహనాలను వేరు చేస్తున్నాము. ఇప్పటి వరకు 14 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అని చెప్పారు. ఇక ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు.