యూపీలో 17మంది జమాతీ సభ్యులు జైలుకి

  • Published By: venkaiahnaidu ,Published On : April 12, 2020 / 07:54 AM IST
యూపీలో 17మంది జమాతీ సభ్యులు జైలుకి

Updated On : April 12, 2020 / 7:54 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించినప్పటికీ వాటిని పట్టించుకోకుండా గత నెలలో నిజాముద్దీన్ ప్రాంతంలోని మర్కజ్ భవన్ లో్ జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమం దేశవ్యాప్తంగా పెద్ద కలకలం రేపిన విషయం తెలిసిందే. దేశంలో నమోదైన దేశంలో కరోనా కంట్రోలో అవుతుందనుకున్న సమయంలో తబ్లిగీ జమాత్ కార్యక్రమం కారణంగా ఒక్కసారిగా భారీస్థాయిలో కరోనా కేసులు పెరిగిన విషయం అందరికీ తెలిసిందే.

దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 40శాతం తబ్లిగీ సభ్యులవే. తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి ఇతర దేశాలతో పాటు,దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు కూడా హాజరయ్యారు. అయితే ముందుజాగ్రత్తగా  ఆయా రాష్ట్రాలు తబ్లిగీ జమాత్ కార్యక్రమానికి హాజరైన వారందరినీ గుర్తించి క్వారంటైన్ సెంటర్లకు తరలించిన విషయం తెలిసిందే.

అయితే ఉత్తరప్రదేశ్ లో దాదాపు 17మంది తబ్లిగీ సభ్యులకు ఆదివారంతో 14రోజుల క్వారంటైన్ పీరియడ్ ముగిసింది. దీంతో వారందరినీ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చిన తర్వాత జైలుకి తరలించారు. ఇండోనేషియా,థాయ్ లాండ్ కు చెందిన ఈ 17మంది వీసా,పాస్ పోర్ట్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను వీరిని జైలుకి తరలించారు.

ప్రభుత్వ ప్రతినిధి తెలిపిన ప్రకారం… తాజ్,ఖురైష్ మసీదుల్లో 17మంది విదేశీయులతో కలుపుకుని 21మంది జమాతీ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి-31న వీరందరినీ క్వారంటైన్ కు తరలించారు. వీరికి టెస్ట్ లు చేయగా కరోనా నెగిటివ్ అని తేలింది. వీరిపై ఐపీసీ సెక్షన్లు 269,270,271,188 మరియు ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్(1897)03,పాస్ పోర్ట్ యాక్ట్(1967)సెక్షన్ 12(3)కింద FIR నమోదుచేసినట్లు తెలిపారు. మాసీదులో దాక్కున్నారన్న సమచారం అందినవెంటనే వారందరినీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.