సూపరో.. సూపర్ : కార్పొరేట్ కు మించి ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్స్

  • Published By: venkaiahnaidu ,Published On : January 28, 2019 / 06:32 AM IST
సూపరో.. సూపర్ : కార్పొరేట్ కు మించి ఢిల్లీ గవర్నమెంట్ స్కూల్స్

Updated On : January 28, 2019 / 6:32 AM IST

దేశానికే ఆదర్శంగా ప్రైమరీ స్కూళ్లను తీర్చిదిద్దేందుకు ఢిల్లీ ప్రభుత్వం కృషి చేస్తోంది. కొత్త కొత్త విధానలతో పతనావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్కూళ్లకు ధీటుగా పనర్నిర్మిస్తూ దేశం దృష్టిని ఢిల్లీ స్కూళ్లవైపు తిప్పుకొనేలా చేస్తోంది కేజ్రీవాల్ సర్కార్. ఢిల్లీ గవర్నమెంట్ స్కూళ్లు కార్పొరేట్ స్కూళ్ల కన్నా చాలా అద్భుతంగా ఉన్నాయని ఢిల్లీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తమ పిల్లలను గవర్నమెంట్ స్కూళ్లకు పంపించేందుకు ఎక్కువగా ఆశక్తి కనబరుస్తున్నారు. ఢిల్లీ గవర్నమెంట్ స్కూళ్లల్లో  ఆహ్లాదకరంగా, అద్భుతంగా ఉన్న క్లాస్ రూమ్ ల ఫొటోలు ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ ఫొటోలను ఓ నెటిజన్ ట్విట్టర్ లో షేర్ చేయడంతో స్పందించిన ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా.. ఇప్పటికే 8వేలకుపైగా క్లాస్ రూమ్ లను ఆహ్లాదకరంగా, అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. 11వేల పైగా ఇలాంటి క్లాస్ రూమ్ లు త్వరలో త్వరలో అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. 2015లో ఢిల్లీ సిటీలోని గవర్నమెంట్ స్కూళ్ల పరిస్థితి చాలా అద్వానంగా ఉండేదని, 17వేల క్లాస్ రూమ్ లు చాలా భయానక స్థితిలో ఉండేవని తెలిపారు. ఈ పరిస్థితి తాము గుర్తించి క్లాస్ రూమ్ లపై ప్రత్యేక శద్ర పెట్టామని సిసోడియా అన్నారు.